https://oktelugu.com/

బీజేపీ ఆపరేషన్ సక్సెస్ అయితే వైసీపీ, టీడీపీకి చిత్తడే..!

2024 ఎన్నికల నాటికి ఏపీలో నిర్ణయాత్మక పార్టీగా ఎదగాలనేది బీజేపీ వ్యూహం. అందుకే వారు నిర్మాణాత్మకంగా పావులు కదుపుతున్నారనిపిస్తుంది. కనుకే చంద్రబాబు ఎంతగా దోస్తీకి ప్రయత్నిస్తున్నా పట్టించుకోవడం లేదు. కారణం బీజేపీతో దోస్తీ వలన బాబుకు ప్రయోజనమే కానీ, వారికి చేకూరుతున్న ప్రయోజనం ఏమీ లేదు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీతో కూటమి కట్టి బాబు తెలివిగా గెలుపు అందుకున్నారు. ఐతే ఆ ఐదేళ్లలో సంస్థాగతంగా బీజేపీ అభివృద్ధి చెందింది ఏమీ లేదు. దీనితో సొంతగా ఎదగడమే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 28, 2020 / 07:38 PM IST
    Follow us on


    2024 ఎన్నికల నాటికి ఏపీలో నిర్ణయాత్మక పార్టీగా ఎదగాలనేది బీజేపీ వ్యూహం. అందుకే వారు నిర్మాణాత్మకంగా పావులు కదుపుతున్నారనిపిస్తుంది. కనుకే చంద్రబాబు ఎంతగా దోస్తీకి ప్రయత్నిస్తున్నా పట్టించుకోవడం లేదు. కారణం బీజేపీతో దోస్తీ వలన బాబుకు ప్రయోజనమే కానీ, వారికి చేకూరుతున్న ప్రయోజనం ఏమీ లేదు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీతో కూటమి కట్టి బాబు తెలివిగా గెలుపు అందుకున్నారు. ఐతే ఆ ఐదేళ్లలో సంస్థాగతంగా బీజేపీ అభివృద్ధి చెందింది ఏమీ లేదు. దీనితో సొంతగా ఎదగడమే దీనికి మార్గం అనుకుంటున్నారు. ఐతే వచ్చే నాలుగేళ్లలో బీజేపీ అధికారం చేపట్టే స్థాయికి ఎదగడం అనేది అసంభవం. దానికి కారణం బీజేపీకి క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు లేరు. ఆ పార్టీ జెండా తెలుగు పల్లెలో ఎక్కడా కనిపించిన దాఖలాలు ఉండవు.

    Also Read: కన్నాపై వేటుకు కారణాలు ఏంటీ?

    ఐతే ఓ బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకొని ఆంద్రప్రదేశ్ లో స్థిరపడాలి అనేది బీజేపీ వ్యూహం. ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఓటు బ్యాంకు కలిగిన కాపు వర్గానికి దగ్గరైతే నిర్ణయాత్మక పార్టీగా ఎదిగే అవకాశం ఉంటుంది అనేది వారి ఆలోచన. ఎన్నికలకు ముందు ఎన్ని విమర్శలు చేసినా, పవన్ పార్టీతో దోస్తీ కట్టడానికి కూడా అదే కారణంగా కనబడుతుంది. దానికి తోడు పవన్ చేరిక వారికి బలం చేకూర్చే విషయమే కానీ, నష్టపరిచేది కాదు. ఎందుకంటే ఒక్క శాతం కూడా ఓటు బ్యాంకు లేని బీజేపీకి 5 శాతం ఓట్లు తెచ్చుకున్న పవన్ కలవడాన్ని ఎందుకు కాదంటారు చెప్పండి.

    Also Read: బీజేపీపై బాబు ఆశలు గల్లంతేనా?

    ఇక నూతన ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నికైన సోము వీర్రాజు కాపు వర్గానికి చెందినవాడు కావడంతో పాటు, అత్యధికంగా కాపు సామాజిక వర్గం ఉన్న తూర్పు గోదావరిలో పుట్టిన నాయకుడు. రాష్ట్రంలోనే అత్యధికంగా 19 అసెంబ్లీ నియోజకవర్గాలు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 15 సీట్లు ఉన్నాయి. అనగా కాపు ఓటు బ్యాంకింగ్ అధికంగా కలిగిన ఈ రెండు జిల్లాలలోనే 34 సీట్లు ఉన్నాయన్న మాట. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, పవన్ కళ్యాణ్ కాపు వర్గాన్ని బీజేపీకి ఓన్ చేసుకొని అక్కడ అత్యధిక సీట్లు సాధించగలిగితే 2024 ఎన్నికలలో బీజేపీ మరియు జనసేనల కూటమి వైసీపీ, టీడీపీలకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయం. ఆ రెండు పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉన్న పక్షంలో కొన్ని సీట్లు గెలుచుకున్న బీజేపీ-జనసేన కూటమి కింగ్ మేకర్ కావచ్చు. అలాగే టీడీపీకి ప్రత్యామ్నాయంగా ఈ కూటమి ఎదిగి వైసీపీకి పోటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కాబట్టి బీజేపీ కాపులకు గాలం వేసిన పక్షంలో 2024 యుద్ధం ఆసక్తికరంగా మారనుంది.