https://oktelugu.com/

కొత్త జిల్లాలతో జగన్ కు తలనొప్పులు తప్పవా?

ఏపీలో కొత్త జిల్లాల తేనెతుట్టును సీఎం జగన్మోహన్ రెడ్డి కదిలిపారు. గత ఎన్నికల్లో జగన్ ఎన్నికల మెనిఫెస్టోలో భాగంగా పార్లమెంట్ నియోజవర్గాలను జిల్లాలుగా చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈమేరకు సీఎస్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. అన్ని జిల్లాల రెవిన్యూ అధికారులతో ఇప్పటికే అన్ని మండలాలకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. Also Read: కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు? […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 28, 2020 / 07:13 PM IST
    Follow us on


    ఏపీలో కొత్త జిల్లాల తేనెతుట్టును సీఎం జగన్మోహన్ రెడ్డి కదిలిపారు. గత ఎన్నికల్లో జగన్ ఎన్నికల మెనిఫెస్టోలో భాగంగా పార్లమెంట్ నియోజవర్గాలను జిల్లాలుగా చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. ఈమేరకు సీఎస్ నేతృత్వంలో ఓ కమిటీని వేసింది. అన్ని జిల్లాల రెవిన్యూ అధికారులతో ఇప్పటికే అన్ని మండలాలకు సంబంధించిన నివేదికలను ప్రభుత్వం తెప్పించుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: కొత్త తెలంగాణ పీసీసీ చీఫ్ కు అదే అడ్డు?

    ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదకన జిల్లాలను ఏర్పాటు చేయాలనుకున్నప్పటికి తెరపైకి మరికొన్ని జిల్లాలు వస్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుతో వైసీపీ ఆయా జిల్లాల్లో మరింత బలపడేందుకు అవకాశాలున్నప్పటికీ సీఎం జగన్ కు కొత్త తలనొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో కొత్త జిల్లాల కోసం ఉద్యమాలు మొదలయ్యాయి. కొందరు తమను పక్క పార్లమెంట్ నియోజకవర్గంలో కలుపొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. దీంతో కొత్త జిల్లాల సెగ జగన్ ను గట్టిగానే తాకే అవకాశం ఉందనే వాదనలు విన్పిస్తున్నాయి.

    ఏపీలో ప్రస్తుతం 13జిల్లాలను పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికన ఏర్పాటు చేస్తే 25జిల్లాలుగా మారనున్నాయి. అరకును రెండు జిల్లాలుగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన నేపథ్యంలో మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరనుంది. అయితే తెరపైకి మరికొన్ని జిల్లాల డిమాండ్ విన్పిస్తుంది. కొత్త జిల్లాల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘ఆదోని’ తెరపైకి వస్తుంది. కర్నూలు జిల్లాను కర్నూలు, నంద్యాల, ఆదోనిగా విభజించాలని ఈ జిల్లావాసులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. లోక్‌సభ స్థానాలే ప్రాతిపదిక అయితే కొత్తగా నంద్యాల జిల్లా మాత్రమే ఏర్పడుతుంది. అయితే ఆదోనిని కూడా ఏర్పాటు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. లేనట్లయితే తమను కర్ణాటకలో కలపాలని తద్వారా తమకు సాగునీటి వివాదాలు పరిష్కారమవుతాయని చెబుతున్నారు. ఈ విషయం జ‌గ‌న్ కు కొత్త సమస్యల తేవడం ఖాయంగా కన్పిస్తుంది.

    Also Read: జగన్ పైకి రఘురామ రాజు మరో అస్త్రం..!

    అదేవిధంగా గుంటూరు జిల్లాలో పల్నాడుకు ప్రత్యేక చరిత్ర ఉంది. దీనికి ప్రధాన కేంద్రం గురజాల. చారిత్రక నేపథ్యం, రాజకీయ చైతన్యం ఉన్న ఈ ప్రాంతాన్ని గురజాలను జిల్లాగా ప్రకటించాలని స్థానికులు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారు. జిల్లాల విభజన నేపథ్యంలో మరోసారి గురజాల డిమాండ్ తెరపైకి వచ్చింది. అలాగే చిత్తూరు జిల్లాలో మదనపల్లె కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ విన్పిస్తోంది. దేశంలోనే మదనపల్లె దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌. వీటితోపాటు చాలాచోట్ల పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గాల‌తో సంబంధం లేకుండా ప్ర‌త్యేక జిల్లాల ఏర్పాటు చేయాల‌ని ప్ర‌జ‌లు డిమాండ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ జిల్లాల డిమాండ్లు సీఎం జ‌గ‌న్‌కు కొత్త సమస్యలు తెచ్చే అవకాశం ఉన్నాయని వాదనలు విన్పిస్తున్నాయి.