https://oktelugu.com/

Ali and Anvesh : ఆలీ దంపతులు మోసం చేశారు, బెట్టింగ్ యాప్స్ వివాదంలో స్టార్ కమెడియన్… యూట్యూబర్ అన్వేష్ సెన్సేషనల్ కామెంట్స్

Ali and Anvesh : ప్రపంచ యాత్రికుడు అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే సెలెబ్స్ ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు.

Written By: , Updated On : March 31, 2025 / 10:38 AM IST
Ali , Anvesh

Ali , Anvesh

Follow us on

Ali and Anvesh : ప్రపంచ యాత్రికుడు అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. డబ్బుల కోసం బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే సెలెబ్స్ ని ఆయన వ్యతిరేకిస్తున్నాడు. తాజాగా ఆయన కమెడియన్ ఆలీ దంపతులపై కీలక ఆరోపణలు చేశాడు.

తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వివాదం హాట్ టాపిక్ గా ఉంది. ఈజీ మనీ కోసం ఆశపడి లక్షల మంది బెట్టింగ్ యాప్స్ బారిన పడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ మోసాలు గ్రహించలేక సర్వం కోల్పోతున్నారు. రోడ్డున పడుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సమాజానికి అత్యంత ప్రమాదకరమైన బెట్టింగ్ యాప్స్ ని సెలెబ్రిటీలు ప్రమోట్ చేయడం శోచనీయం. ఈ అంశాన్ని ప్రముఖ యూట్యూబర్ అన్వేష్ తెరపైకి తెచ్చాడు. ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు.

Also Read : అలీని వదలని పవన్ ఫ్యాన్స్.. ఓ రేంజ్ లో ఆడేస్తున్నారు!

ఇప్పటికే పలువురు యూట్యూబర్స్, సోషల్ మీడియా స్టార్స్, బుల్లితెర, వెండితెర సెలెబ్స్ మీద కేసులు నమోదు అయ్యాయి. వారు విచారణ ఎదుర్కొన్నారు. ఇకపై బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయమని వీడియోలు విడుదల చేశారు. ప్రకాష్ రాజ్ సైతం ఈ ఆరోపణలు ఎదుర్కొన్నారు. గతంలో ఆయన ఒక జూదం యాడ్ లో నటించాడు. ప్రకాష్ రాజ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తాజాగా ఈ వివాదంలో కమెడియన్ ఆలీ ఇరుక్కున్నాడు. ఆలీ దంపతులు ఒక బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేసి లక్షలు ఆర్జించారు. జనాలు మోసపోయేలా చేశారంటూ యూట్యూబర్ అన్వేష్ ఆరోపణలు చేశాడు. ఈ మేరకు అన్వేష్ చేసిన వీడియో వైరల్ అవుతుంది.

కేవలం 10 వేల రూపాయలు ఖర్చుతో బిర్యానీ చేసి, అది పేదలకు పంచారు. ఆ వీడియోను ఆలీ దంపతులు తమ యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తే 50 లక్షల మంది చూశారు. అంటే 5 లక్షల వరకు ఆదాయం వచ్చి ఉంటుంది. సదరు వీడియోలో ఆలీ, ఆయన భార్య జుబేదా ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేశారు. ఇది నిజంగా అన్యాయం. వెయ్యికి పైగా సినిమాల్లో నటించిన ఆలీ కి వేల కోట్ల ఆస్తి ఉంది. ఆయన బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఏముంది. ఆయన మాటలు విని బెట్టింగ్ యాప్ ద్వారా ఎంత మంది డబ్బులు నష్టపోయి ఉంటారు.. అంటూ అన్వేష్ మండిపడ్డాడు.

యూసుఫ్ ఖాన్ అనే ఒక పాకిస్థాన్ వ్యక్తికి చెందిన ఆ బెట్టింగ్ యాప్ వలన చాలా మంది నష్టపోయారు. దాదాపు 50 వేల కోట్ల రూపాయలు దోచుకుని వెళ్ళిపోయాడు. దేశానికి, ప్రజలకు నష్టం చేకూర్చే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం తగదు. ఆలీ దంపతులు నేరం చేశారంటూ అన్వేష్ దుయ్యబట్టాడు. ఈ క్రమంలో ఆలీ దంపతులు విచారణ ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి.

Also Read : ‘బలగం’ చిత్రం బాహుబలి వసూళ్లతో సమానం అంటూ కమెడియన్ అలీ షాకింగ్ కామెంట్స్