https://oktelugu.com/

MAA Elections: ‘మా’ ఎన్నికల్లోకి ఎన్నికల వ్యూహకర్త ‘ప్రశాంత్ కిశోర్’ రావాల్సిందే..

MAA Elections: ‘మా’ ఎన్నికలు మునుపెన్నడూ లేనంతా తీవ్రంగా సాగుతున్నాయి. ఓవైపు మంచు విష్ణు ప్యానెల్, మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ కొదమ సింహాల్లో నిన్నటి వరకూ కొట్టుకున్నాయి. ఓటుకు నోటు, విమాన టికెట్లు, మందు విందులు సహా ఎన్ని అవకాశాలున్నాయో అన్నింటిని సినీ ప్రముఖులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వాడేశారు. సాధారణ రాజకీయ ఎన్నికలను మించిపోయేలా ఈసారి ‘మా’ ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలోనే ‘మా’ ఎన్నికలు చూసి అటు ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. […]

Written By: NARESH, Updated On : October 10, 2021 12:19 pm
Follow us on

MAA Elections: ‘మా’ ఎన్నికలు మునుపెన్నడూ లేనంతా తీవ్రంగా సాగుతున్నాయి. ఓవైపు మంచు విష్ణు ప్యానెల్, మరోవైపు ప్రకాష్ రాజ్ ప్యానెల్స్ కొదమ సింహాల్లో నిన్నటి వరకూ కొట్టుకున్నాయి. ఓటుకు నోటు, విమాన టికెట్లు, మందు విందులు సహా ఎన్ని అవకాశాలున్నాయో అన్నింటిని సినీ ప్రముఖులు ఓటర్లను ఆకట్టుకోవడానికి వాడేశారు. సాధారణ రాజకీయ ఎన్నికలను మించిపోయేలా ఈసారి ‘మా’ ఎన్నికలు జరిగాయి.

ఈ క్రమంలోనే ‘మా’ ఎన్నికలు చూసి అటు ప్రజలు, రాజకీయ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. తాజాగా ‘మా’ ఎన్నికలపై నటుడు జీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత దారుణంగా పోటీపడుతారని అనుకోలేదని.. వీళ్ల వ్యూహాలు చూస్తుంటే వచ్చేసారి ఎన్నికల్లో తాను నిలబడి ఎంత ఖర్చు అయినా సరే రాజకీయ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను పెట్టుకొని ‘మా’ ఎన్నికల్లో పోటీచేయాలని ఉందని’ హాట్ కామెంట్స్ చేశారు.

పరిస్థితి చూస్తుంటే ప్రస్తుతం అలానే కనిపిస్తోంది. మా ఎన్నికల కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెల్స్ ఎన్ని వ్యూహాలు పన్నాలో అన్నీ పన్నేశారు. వాళ్లు చేయని పనులు లేవు. అందుకే ఇప్పుడు రాబోయే ఎన్నికల టైంకు నిజంగానే గెలుపు కోసం వ్యూహకర్తలను నియమించుకునే వరకూ వెళతారా? అన్న సందేహాలు కలుగకమానవు.

పట్టుమని 900 మంది సభ్యులు కూడా లేని ‘మా’ ఎన్నికల్లో ఇన్ని కోపాలు , తాపాలు అవసరమా? అన్న చర్చ కూడా సాగుతోంది. ఇంత దారుణంగా బజారున పడేలా మా సభ్యులు వ్యవహరిస్తుంటే చూసే వాళ్లకే ఏహ్యాభావం కలుగుతోంది. నిన్నటివరకూ కొట్టుకొని తిట్టుకొని ఈరోజు మీడియా ముందు నవ్వుతూ హగ్ లు చేసుకోవడం ఏంటీ సినీ ప్రముఖులకే తెలియాలి.. చూస్తుంటే వచ్చేసారికి ఖచ్చితంగా ‘ప్రశాంత్ కిషోర్’లాంటి వ్యూహకర్తలు మా ఎన్నికలకు అవసరం అయ్యేలానే కనిపిస్తున్నారు.