https://oktelugu.com/

Amit Shah: అమిత్ షా టీపీసీసీ అధ్యక్షుడి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందేనా?

Amit Shah: రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కిచెందిన మంత్రి కేటీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అమిత్ షా కు పలు అంశాల్లో ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో ఎందుకు పర్యటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. . రైతు వ్యతిరేక చట్టాలు చేసిన మీరు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ లోపాయకారి […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 14, 2022 / 06:09 PM IST
    Follow us on

    Amit Shah: రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కిచెందిన మంత్రి కేటీఆర్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా అమిత్ షా కు పలు అంశాల్లో ప్రశ్నలు వేశారు. రాష్ట్రంలో ఎందుకు పర్యటిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. . రైతు వ్యతిరేక చట్టాలు చేసిన మీరు రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న టీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోందిని ఆరోపించారు. ఘాటైన విమర్శలు చేశారు.

    Amit Shah

    ఎరువుల సబ్సిడీలు ఎత్తివేసి రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు. బ్యాంకులను దగా చేసిన బడా బాబులకు వంత పాడుతూ ప్రజా సొమ్మును దగా చేస్తున్నారు. 2018 నుంచి ఇప్పటివరకు మూడు సార్లు రాష్ట్రంలో పర్యటించినా సమస్యల పరిష్కారం మాత్రం జరగలేదు. కానీ మీరు మాత్రం వస్తున్నారు. పోతున్నారు. ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రజల సంపదను దోపిడీ చేస్తున్న వారిని ఉపేక్షించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

    Revanth Reddy

    ప్రాణహిత-చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టుల్లో అవినతి జరిగినా ఇంతవరకు మీరు ఏం చర్యలు తీసుకున్నారు. బీజేపీ నేతలు చెబుతున్నా కేసీఆర్ ను ఎప్పుడు జైలుకు పంపుతారో తెలియడం లేదు. మీ ప్రభుత్వంలోనే మనిషికో మాట మాట్లాడుతూ కుంభకోణాలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా సీఎం కుటుంబం లక్షల కోట్ల స్కాములు చేస్తూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. దీనిపై మీ ఆంతర్యమేమిటో చెప్పాల్సిందే.

    Also Read: Ambati Rayudu: అంబటి రాయుడు ఇక ఐపీఎల్ లో ఆడడం లేదా?

    ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మీరు ఇద్దరు కలిసి నాటకాలు ఆడారు. దీంతో తెలంగాణలో మొదట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎత్తివేసినట్లు ప్రకటించి తరువాత మళ్లీ ధాన్యం కొనుగోలు చేయడం అంతా మీ ప్లాన్లలో భాగమేనని తెలుస్తోంది. మీరెండు పార్టీలు రాజకీయ డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు.

    మూడేళ్లలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు చేయలేదు. ఎంపీ అరవింద్ రైతులకు బాండ్ పేపర్ రాసిచ్చి కూడా ఇంతవరకు బోర్డు ఏర్పాటు చేయకపోవడమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పి ఇంతవరకు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు

    అమిత్ షా ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని అడిగారు. గ్యాస్ పై సబ్సిడీ ఎత్తివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు. వీటన్నింటికి అమిత్ షా సమాధానం చెప్పాలని అడుగుతున్నారు.

    Also Read: Naga Chaitanya Thank You: జూలై 8న ‘థాంక్యూ’.. చైతు కొత్తగా ట్రై చేశాడు !

    Tags