President rule: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ రగడ మొదలైంది. వైసీపీ వర్సెస్ టీడీపీ యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యాలయంపై వైసీపీ నేతల దాడి నేపథ్యంలో రాష్ర్టంలో అత్యవసర పరిస్థితి విధించే విధంగా పరిస్థితి తయారయింది. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టులతో రాష్ర్టం రావణకాష్టంలా మారింది. దీంతో ఏపీలో పరిస్థితి దారుణంగా మారింది. టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలతో మొదలైన గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. దీంతో రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి భయాందోళన పట్టుకుంది. అధికారం కోసం అన్ని దారులు వెతుకుతోంది. పలువురు ఇతర పార్టీల నేతలను ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా నేతలకు గాలం వేయాలని ప్రయత్నాలు ఆరంభించింది. ఇప్పటికే పలు జిల్లాల్లో పార్టీలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలో కూర్చోబెట్టడానికి అన్ని మార్గాలు అన్వేషిస్తోంది.
ఈ నేపథ్యంలో టీడీపీ కార్యాలయంపై వైసీపీ దాడికి ప్రయత్నించడంతో టీడీపీ ఎదురుదాడికి దిగుతోంది. రాష్ర్టంలో ప్రజాస్వామ్య పాలన కనిపించడం లేదని రాక్షసపాలన సాగుతోందని దుమ్మెత్తిపోస్తోంది. అడ్డుకోవాల్సిన పోలీసులు కూడా పట్టించుకోవడం లేదని వాపోతోంది. దీనిపై డీజీపీ గౌతం సవాంగ్ సైతం పట్టించుకోవడం లేదని ఆరోపణలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల తీరుతో వైసీపీ ఇరకాటంలో పడినట్లు అవుతోంది.
టీడీపీ నేత పట్టాభి వ్యాఖ్యలతో వైసీపీ నేతల్లో ఆగ్రహం పెరిగిపోయింది. దీంతో వారు తట్టుకోలేకనే టీడీపీ కార్యాలయంపై దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా బాబు ఇంటిపై కూడా దాడి జరిగినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. దీంతో రెండు పార్టీల మధ్య గొడవలు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
దీంతో రాష్ర్టంలో రాజకీయ దుమారం రేగుతోంది. అధికారమే లక్ష్యంగా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇందులో భాగంగానే ఏపీలో రోజురోజుకు పరిస్థితి దిగజారిపోతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వైసీపీ, టీడీపీ మధ్య వైరం మరింత దూరం పెరిగిపోతోంది. దీనిపై పరిస్థితి అదుపు తప్పకుండా ఉండేందుకు అదికారులు చర్యలు తీసుకుంటున్నారు.