Ali Reza: నటుడు, బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్ అలీ రెజా ఫుల్ ఆనందంలో ఉన్నాడు. ఆయన సతీమణి మసుమ ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులందరికీ తెలియజేశాడు ఆలీ. ‘అందమైన దేవతకు తండ్రినయ్యానని సగర్వంగా చెప్తున్నాను… తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు, మమ్మల్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు’ అని పోస్ట్ చేశాడు. అలానే ఈ సంధర్భంగా తన పాపను ఎత్తుకున్న ఫోటోను అభిమానులతో పంచుకున్నాడు. ఈ వార్త తెలియడంతో ఆయన సన్నిహితులు, మాజీ బిగ్‌బాస్ కంటెస్టెంట్లు, పలువురు సెలబ్రిటీలు. అభిమానులు… అలీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

తెలుగులో పలు సిరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ … నటుడిగా మంచి పేరు సంపాదించుకున్నాడు. నటుడిగా సినిమాల్లో రాణిస్తూనే… మోడల్‌గానూ చేస్తున్నాడు ఈ యంగ్ నటుడు. ‘గాయకుడు’ సినిమాతో హీరోగా వెండితెరపై అరంగ్రేటం చేసిన అలీకి … ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్‌లో పాల్గొని ఎంతోమంది అభిమానులను సంపాదించుకోగలిగాడు.
నాగార్జునతో వైల్డ్ డాగ్ అనే సినిమాలో కీలకపాత్ర పోషించాడు అలీ. ఆ సీజన్ లో తనదైన గేమ్ తో , స్నేహంతో అలీ ప్రవర్తించిన తీరుకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ కారణం గానే టాప్ 5 లో నిలవగలిగాడు అలీ. కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరుల ప్రశంసలను కూడా అందుకున్నాడు. ‘గుండెల్లో దమ్మున్న దోస్త్ ఖాజా భాయ్’ అనే మరో సినిమాను చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించాడు. ప్రస్తుతం ఈ చిన్నారిని ముద్దాడుతున్న ఫోటోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.