https://oktelugu.com/

కాంగ్రెస్‌కు షాక్‌ల మీద షాక్‌లు

ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ గ్రేటర్‌‌ ఎన్నికలతో ఆ పార్టీ మరింత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యనేతలంతా వలసెళ్లిపోతున్నారు. ఒక్కో సీనియర్‌‌ లీడర్‌‌ పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే బండ కార్తీక లాంటి సీనియర్‌‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరగా.. మాజీ ఎంపీ విజయశాంతి సైతం కాషాయ కండువా కప్పుకోనున్నట్లు చర్చ జరుగుతోంది. Also Read: ఆకర్ష్‌తో బీజేపీ పరువు తీసుకుంటోందా..? అంతేకాదు.. మరో ఇద్దరు మాజీ ఎంపీలు కూడా హస్తానికి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 21, 2020 / 02:39 PM IST
    Follow us on

    ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఈ గ్రేటర్‌‌ ఎన్నికలతో ఆ పార్టీ మరింత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ముఖ్యనేతలంతా వలసెళ్లిపోతున్నారు. ఒక్కో సీనియర్‌‌ లీడర్‌‌ పార్టీ నుంచి తప్పుకుంటున్నారు. ఇప్పటికే బండ కార్తీక లాంటి సీనియర్‌‌ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరగా.. మాజీ ఎంపీ విజయశాంతి సైతం కాషాయ కండువా కప్పుకోనున్నట్లు చర్చ జరుగుతోంది.

    Also Read: ఆకర్ష్‌తో బీజేపీ పరువు తీసుకుంటోందా..?

    అంతేకాదు.. మరో ఇద్దరు మాజీ ఎంపీలు కూడా హస్తానికి గుడ్ బై చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ.. కాంగ్రెస్‌లోని కీలక నేతలను తనవైపునకు తిప్పుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అందుకే.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఇంకొందరు కీలక నేతలతో కలిసి సర్వే సత్యనారాయణ ఇంటికి వెళ్లారు. బీజేపీలో చేరాల్సిందిగా ఆహ్వానించారు.

    ఎస్సీ సామాజిక వర్గానికే చెందిన మాజీ ఎంపీ వివేక్.. సర్వేను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని బీజేపీ జాతీయ ప్రధాని కార్యదర్శి భూపేందర్‌ యాదవ్ కలిసినట్లు తెలుస్తోంది. విశ్వేశ్వర్‌రెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. భూపేందర్ యాదవ్ విజ్ఞప్తిపై విశ్వేశ్వర్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.

    Also Read: కాంగ్రెస్ విలాపం: రాష్ట్రాల్లో సీట్లు ఇచ్చేవారే లేరా?

    అయితే.. ఈ ఇద్దరు నేతలు బీజేపీలో చేరడంపై అధికారిక ప్రకటన ఏమీ వెలువడలేదు. బీజేపీ ప్రచార వ్యూహంలో భాగంగానే కాంగ్రెస్ నేతలను కలుస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి కమలం గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ ఎన్నికల ముగిసిన తర్వాత ఆమె ఢిల్లీ వెళ్లి బీజేపీ ఆగ్రనేతల సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు సమాచారం. విజయశాంతి ఇంటికి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లి చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రాబోయే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ ఇప్పటి నుంచే దూకుడుగా వెళ్తున్నట్లు తెలుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్