తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. మొన్నటిదాకా టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే ఫీలింగ్ ఉండేది. కానీ.. అనూహ్యంగా దుబ్బాక ఉప ఎన్నికతో బీజేపీ బలపడింది. ఆ ఉప ఎన్నికలో సంచలన విజయం సాధించి టీఆర్‌ఎస్‌కు తామే ధీటు అని బదులిచ్చింది. ఒక్కసారిగా బలమైన శక్తిగా ఎదిగిన బీజేపీ తన బలహీనతలను ఒక్కొక్కటిగా బయట పెట్టుకుంటోంది.
Also Read: తిరుపతి ఉప ఎన్నిక కోసం టీడీపీ చీకటి ఒప్పందం
అభ్యర్థులు లేక.. టీఆర్ఎస్‌లో టిక్కెట్ దక్కని వాళ్లు ఎవరు వచ్చినా బీఫాం ఇచ్చి కండువా కప్పేశారు. తాజాగా.. పార్టీ ముఖ్య నేతలు.. ఇతర పార్టీల నేతల ఇళ్ల చుట్టూ చక్కర్లు కొడుతుండటం విమర్శలకు కారణం అవుతోంది. కాంగ్రెస్‌లో తమకు పరిచయం ఉన్న కొంత మంది పేర్లు రాసుకుని వారి ఇళ్లకు పరుగెడుతున్నారు బీజేపీ నేతలు. అలా వెళ్తున్నారో లేదో.. ఇలా మీడియాకు లీక్ చేస్తున్నారు. వారు బీజేపీలోకి వస్తున్నారని ప్రచారం చేయించేసుకుంటున్నారు. తర్వాత అసలు విషయంపై ఆ నేతలు క్లారిటీ ఇచ్చిన తర్వాత బీజేపీకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో బీజేపీ నేతలు చర్చలు జరిపారని.. ఆయన బీజేపీలో చేరిపోతారని ప్రచారం చేశారు. చేరినట్లే అని మీడియాకు లీక్ ఇచ్చారు. తర్వాత ఆయన స్వయంగా ఆదో రూమర్ అని.. అన్ని పార్టీల్లోనూ తనకు స్నేహితులున్నారని తేల్చేశారు. దాంతో బీజేపీ నేతల ప్లాన్ అట్టర్ ఫ్లాపయింది. తర్వాత సర్వే సత్యనారాయణ విషయంలోనూ అదే జరిగింది. సర్వేను రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడెళ్లి బీజేపీలోకి ఆహ్వానించి.. కాంగ్రెస్‌కు షాక్ అని ప్రచారం చేయించేశారు.
Also Read: కాంగ్రెస్ విలాపం: రాష్ట్రాల్లో సీట్లు ఇచ్చేవారే లేరా?
ఒకవిధంగా చెప్పాలంటే రాష్ట్రంలో బీజేపీ బలపడింది. కానీ.. ఆ బలాన్ని చూసి ఇతర పార్టీల నేతలు స్వయంగా పార్టీలోకి వస్తే బాగుంటుంది. అలాకాకుండా వీరే స్వయంగా వెళ్లి ఆహ్వానిచడం ఏంటో అర్థం కాకుండా ఉంది. ఇతర పార్టీలను బలహీనపరచాలని బీజేపీ ఈ స్టంట్ వాడుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకే.. ఈ స్థాయిలో ఆకర్ష్ మొదలుపెట్టినట్లుగా అర్థమవుతోంది. ఆకర్ష్ చేస్తున్నప్పటికీ పార్టీ పరువు పోకుండా మెదిలితే బెటర్ అని రాజకీయ నిపుణుల అభిప్రాయం.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్