https://oktelugu.com/

ముఖేష్ అంబానీ కేసులో షాకింగ్ ట్విస్ట్ .. సీసీ టీవీ ఫుటేజ్ మాయం

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీకి ఈ మధ్య బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ముఖేష్ ఇంటికి సమీపంలో స్కార్పియో వాహనంలో జిలెటిన్ స్టిక్స్ పెట్టి , ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు లేఖ రాశారు. ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అంబానీ బెదిరింపుల కేసులో అనుమానితుడిగా అరెస్టయిన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజేను కోర్టు ఈ నెల మార్చి 25 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 16, 2021 / 03:03 PM IST
    Follow us on


    ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీకి ఈ మధ్య బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. ముఖేష్ ఇంటికి సమీపంలో స్కార్పియో వాహనంలో జిలెటిన్ స్టిక్స్ పెట్టి , ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు లేఖ రాశారు. ఇప్పుడు ఆ కేసు దర్యాప్తు రోజుకో కొత్త మలుపు తిరుగుతోంది. అంబానీ బెదిరింపుల కేసులో అనుమానితుడిగా అరెస్టయిన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజేను కోర్టు ఈ నెల మార్చి 25 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది. ఈ కేసులో మొదటి స్కార్పియో వాహనం యజమానిగా భావించిన మన్సుఖ్ హిరెన్‌ను ప్రశ్నించిన పోలీసులు ఆ వాహనం దొంగతనానికి గురైందని వెల్లడించారు. ఆ తర్వాత ఈ కేసులో కీలక సాక్ష్యంగా భావిస్తున్న హిరెన్ హత్యకు గురికావడంతో కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక హిరెన్ భార్య ఆ స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే నాలుగు నెలలపాటు వాడుకున్నాడని చెప్పడంతో కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి.

    Also Read: పసుపు బోర్డు ఏమైందో అర్వింద్‌ చెప్పాలి.. జీవన్‌రెడ్డి నిలదీత

    మొదట ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో మొదటి దర్యాప్తు అధికారిగా వ్యవహరించింది. ఆ వాహనాన్ని వినియోగించారని చెప్తున్న పోలీస్ అధికారి సచిన్ వాజే కావడంతో వెంటనే అతనిని ప్రభుత్వం బదిలీ చేసింది. తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది. ఎన్‌ఐఏ అధికారులు అతనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అయితే.. సచిన్ వాజే ఆ స్కార్పియో ఉపయోగించారా లేదా అనేది తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సీసీ టీవి ఫుటేజ్ లభించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

    ఈ కేసు విషయంలో తన ప్రమేయాన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో సచిన్ వాజే నివాసముంటున్న హౌసింగ్ సొసైటీ యొక్క డిజిటల్ వీడియో రికార్డర్‌‌ను ఇంటెలిజెన్స్ ఏజెన్సీలో నాడు అధికారిగా ఉన్న సచిన్ వాజే స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐఏ డిజిటల్ వీడియో రికార్డ్ నుంచి వచ్చిన సీసీ టీవీ ఫుటేజ్ లో ఏమీ లేకపోవడంతో ఈ కేసులో మరింత ఆసక్తికరంగా మారింది. మొదట ఆరోపణలు ఎదుర్కొన్న సచిన్ వాజేను సీఐయు నుంచి ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంలోని సిటిజెన్ ఫెసిలిటేషన్ సెంటర్‌కు బదిలీ చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సచిన్ వాజే‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. నిన్న ఆయనను సర్వీసు నుంచి సస్పెండ్ చేశారు.

    Also Read: హామీ ఇవ్వడం.. మాట మార్చడం.. వారికి అలవాటేగా.!

    సచిన్ వాజే తన సొంత రెసిడెన్షియల్ సొసైటీ యొక్క డీవీఆర్ మరియు టీవీ పుటేజ్‌లను ఎందుకు స్వాధీనం చేసుకున్నారన్న దానిపై ఇప్పుడు ఆసక్తిగా ఉంది. దర్యాప్తులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మన్సుఖ్ హిరేన్‌తో తన సంబంధాలు బహిర్గతం అయిన తర్వాత అతనిపై ఏవైనా ఆధారాలు దొరకకుండా ఉండడం కోసం సచిన్ వాజే ఈ పని చేసి ఉండవచ్చని ఎన్ఐఏ అనుమానిస్తోంది. సీఐయు అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్‌‌ రియాజ్ కాజీని కూడా ఏజెన్సీ ప్రశ్నిస్తోంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్