https://oktelugu.com/

పసుపు బోర్డు ఏమైందో అర్వింద్‌ చెప్పాలి.. జీవన్‌రెడ్డి నిలదీత

తనను గెలిపిస్తే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం తేల్చి చెప్పింది. పసుపుబోర్డు ఏర్పాటుపై రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారు. Also Read: అగ్గువకు విశాఖ భూములు.. 19 వేల ఎకరాలు 55 కోట్లేనట..! నిజామాబాద్‌లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 16, 2021 / 02:38 PM IST
    Follow us on


    తనను గెలిపిస్తే నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చిన బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆశలపై కేంద్రం నీళ్లు చల్లింది. తెలంగాణలో పసుపుబోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్రం తేల్చి చెప్పింది. పసుపుబోర్డు ఏర్పాటుపై రాజ్యసభలో కేఆర్ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి తోమర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

    Also Read: అగ్గువకు విశాఖ భూములు.. 19 వేల ఎకరాలు 55 కోట్లేనట..!

    నిజామాబాద్‌లో ఇప్పటికే సుగంధ ద్రవ్యాల ఎగుమతుల కోసం స్పైసెస్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేశామని, పసుపు, ఇతర సుగంధ ద్రవ్యాల ఎగుమతి ప్రచారానికి వరంగల్, హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మంలలో బోర్డు కార్యాలయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు పసుపు బోర్డు ఏర్పాటుకు సంబంధించి కేంద్రం ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదన లేదని మంత్రి స్పష్టం చేశారు.

    ఇప్పుడు ఈ అంశంపై టీఆర్‌‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఫైర్‌‌ అయ్యారు. గన్‌పార్క్‌ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పసుపు బోర్డు ఏమైందో నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోమని కేంద్రం పార్లమెంట్‌ సాక్షిగా చెప్పిందన్నారు. ఎన్నికల సమయంలో బోర్డు తీసుకురాకపోతే రాజీనామా చేస్తానని చెప్పిన అర్వింద్‌.. ఇప్పుడు ఆ పనిచేసి ఉద్యమానికి సిద్ధం కావాలన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దగ్గరికి వెళ్లి పసుపు బోర్డుపై మాట్లాడాలన్నారు.

    Also Read: ఒక్కొక్కరుగా ‘హ్యాండ్‌’ ఇస్తున్న రేవంత్ వర్గీయులు

    బీజేపీ అంటేనే అబద్ధాల పార్టీ అని.. అమ్మకం పార్టీగా కూడా మారిందని జీవన్‌రెడ్డి విమర్శించారు. ప్రతిరోజూ ఏదో ఒక సంస్థను బీజేపీ అమ్ముతోందని పేర్కొన్నారు. తెలంగాణ రావాల్సిన ఐటీఐఆర్‌‌ ప్రాజెక్టు, రైల్వే కోచ్‌ అవ్వమని ఇప్పటికే కేంద్రం చెప్పిందని.. దానిపై పోరాడాలని అన్నారు. టీఆర్‌‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధిని చెప్పడానికి నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌‌కు గంటకు పైగా సమయం పట్టిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని జీవన్‌ రెడ్డి అన్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్