
ఏ ఎగ్జామ్స్‌కు అయినా.. వాటికి సంబంధించి సిలబస్ ఉంటుంది. కానీ.. అదేంటో కాకతీయ యూనివర్సిటీ నిర్వహించిన ఎస్‌డీఎల్‌సీఈ ఎగ్జామ్‌లో సంబంధం లేని ప్రశ్నలు ఇవ్వడంతో ఎగ్జామ్ రాసే అభ్యర్థులు తలలు పట్టుకున్నారు. ఈ ఎగ్జామ్‌లో ఏకంగా టీఆర్‌ఎస్ పార్టీపై, కేసీఆర్‌పై ప్రశ్నలు ఇవ్వడంతో విద్యార్థులు షాక్‌కు గురయ్యారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయానికి కారణాలేంటి..? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఏంటి ? వంటి ప్రశ్నలను ఇవ్వడంతో విద్యార్థులు ఖంగుతిన్నారు.
Also Read: సీనియర్లు రాకున్నా.. సత్తా చాటిన రేవంత్
కాకతీయ యూనివర్సిటీ, స్కూల్ ఆఫ్ డిస్టెన్స్ లర్నింగ్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్ ఎంఏ పొలిటికల్ సైన్స్ పేపర్‌లో ఇచ్చిన ప్రశ్నలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎం పొలిటికల్ సైన్స్ ఫైనల్ ఇయర్ పేపర్‌లో గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే సబ్జెక్టు ఉంది. అయితే ప్రశ్నపత్రంపై మాత్రం గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ ఇన్ తెలంగాణ అనే సబ్జెక్టును ఇచ్చారని విద్యార్థులు చెబుతున్నారు.
రాష్ట్ర రాజకీయాల అధ్యయన దృక్పథాలు, రాష్ట్ర రాజకీయ చరిత్ర, ఆంధ్రప్రదేశ్‌లో స్వతంత్ర ఉద్యమం, సాంఘిక ఆర్థిక పరిస్థితులు, ఆంధ్ర రాష్ట్ర అవతరణ, గవర్నర్ వ్యవస్థ విశ్లేషణ, మంత్రిమండలి ముఖ్యమంత్రి, హైకోర్టు, ఆంధ్రప్రదేశ్‌లో రైతు ఉద్యమాలు, ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల రాజకీయ పరిణామాలు, పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణం విధులు వంటి అంశాలపై సిలబస్ ఉండగా, సిలబస్‌కు భిన్నంగా తెలంగాణ రాజకీయాల నుండి ప్రశ్నలు వేశారు.
Also Read: నటుడిగా కాదు.. ప్రమాద బాధితుడిగా వచ్చాను: ఎన్టీఆర్ ఎమోషనల్
తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర ఏంటి? ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయానికి కారణాలేంటి ? 1969 నాటి ఉద్యమం బలహీనపడ్డాయి కారణాలేంటి? తెలంగాణలో కిందిస్థాయి పాలనలో చేపట్టిన సంస్కరణలు ఏంటి ? వంటి అసంబద్ధమైన ప్రశ్నలు ఇచ్చారని విద్యార్థులు లబోదిబోమన్నారు. అంతేకాదు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎందుకు క్షీణించిన కారణాలు చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇలా సిలబస్‌లో లేని ప్రశ్నలు ఇవ్వటమే కాకుండా టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్‌కు సంబంధించి ప్రశ్నలు ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్