స్వర్ణ ప్యాలెస్ అగ్ని ప్రమాదంకి… ఏపీ కరోనా మరణాలకి మధ్య షాకింగ్ లింక్…!

  భారత దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డులు సాధిస్తున్నా గాని వాస్తవంలో మాత్రం ప్రభుత్వం వైఫల్యం ఎవరికీ కనిపించడం లేదు. రోజుకి దగ్గర దగ్గర 10 వేల కేసులు ఏపీలో నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి కేసులలో వృద్ధిరేటు ఏపీ లోనే చాలా ఎక్కువ. అంతే కాకుండా దేశవ్యాప్తంగా క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మరణాల రేటు మాత్రం తగ్గుతూ వస్తోంది. ఒక ఏపీలో మాత్రం పరిస్థితి […]

Written By: Navya, Updated On : August 13, 2020 10:17 am
Follow us on

 

భారత దేశంలోనే అత్యధిక టెస్టులు చేసిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రికార్డులు సాధిస్తున్నా గాని వాస్తవంలో మాత్రం ప్రభుత్వం వైఫల్యం ఎవరికీ కనిపించడం లేదు. రోజుకి దగ్గర దగ్గర 10 వేల కేసులు ఏపీలో నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి కేసులలో వృద్ధిరేటు ఏపీ లోనే చాలా ఎక్కువ. అంతే కాకుండా దేశవ్యాప్తంగా క్రమంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నా.. మరణాల రేటు మాత్రం తగ్గుతూ వస్తోంది. ఒక ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. రోజూ కనీసం 80 నుండి 100 మంది మృత్యువాత పడుతున్నారు. అసలు ఏపీలో కరోనా మరణాలకు స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదానికి లింక్ ఏమిటి?

స్వర్ణ ప్యాలెస్ అనేది హాస్పిటల్ కాదు. రమేష్ ఆసుపత్రి వారు దానిని కోవిడ్ సెంటర్ ఉపయోగించుకునేందుకు లీజుకు తీసుకున్నారు. తీరా చూస్తే పేషెంట్లు, వైద్య సిబ్బందితో కలిపి 50 మంది ఉన్నా ఆ భవనంలో ఘోరమైన అగ్నిప్రమాదం సంభవించి 10 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. ఇప్పుడు ఏపీలో కరోనా మరణాలు కూడా అన్ని అలా జరుగుతున్నాయని కాదు. విషయం ఏమిటంటే ప్రైవేట్ హాస్పిటల్స్ వారు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అన్ని చోట్లా ఇలా అరకొర సదుపాయాలు ఉన్న భవనాలను డబ్బులకు కక్కుర్తిపడి కోవిడ్ సెంటర్లుగా మారుస్తున్నారు.

అదే ఆస్పత్రిలో అయితే…. పరిస్థితి విషయం కాగానే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ యూనిట్లు అప్రమత్తమై అందుకు సంబంధించిన పరికరాలను సమకూరుస్తారు. ఎంతైనా ఈ కోవిడ్ సెంటర్ లలో మాత్రం అటువంటి పరిస్థితి ఉండేది లేదని విశ్లేషకుల మాట. అంతేకాకుండా ప్రజలు కూడా ఈ కోవిడ్ సెంటర్లు రిస్క్ అని తెలిసినా కూడా… ప్రభుత్వాసుపత్రుల పై నమ్మకం లేక అక్కడ చేరడానికే మొగ్గు చూపుతున్నారు.

రాష్ట్రంలోని సొంత నేతలు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు తాము పాలిస్తున్న, తమ పర్యవేక్షణ లో ఉన్న ఆస్పత్రిలలో చికిత్స తీసుకోకుండా హైదరాబాద్ మహానగరంలో కార్పొరేట్ ఆస్పత్రులకి వెళితే ఇక్కడి ప్రజలకు నమ్మకం ఎలా వస్తుంది..? అందుకని ఇలా కోవిడ్ సెంటర్లలో చాలామంది సరైన చికిత్స సరిగ్గా అందక చనిపోతున్నారు అని ఆరోపణ. అంతేకాకుండా ఇలాంటి చోట్ల ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే సేఫ్టీ యూనిట్లు సరిగ్గా పనిచేసే పరిస్థితి లేదని విజయవాడ ఘటన తో అర్థం అయిపోయింది. మరి ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వాసుపత్రుల పై నమ్మకం కలిగించడం లేదా ఇటువంటి సెంటర్లపై తీవ్రమైన చర్యలు తీసుకునే పనులు చేస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.