https://oktelugu.com/

బాలయ్యకి లావణ్య సెట్ అయింది !

నట సింహం అని గొప్పగా పిలిపించుకునే బాలయ్య బాబు, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సింహం లాంటి సినిమా చేస్తున్నానని అంటున్నాడు. కాకపోతే, ఈ సింహానికి హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. పాపం హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే కరోనాకి ముందు ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ ని కూడా పూర్తిచేశారు. ఏమైనా అప్పటి నుండి బాలయ్యకి హీరోయిన్ దొరకలేదు. నిజానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందు నుంచే, చాలామంది హీరోయిన్ల పేర్లు […]

Written By:
  • admin
  • , Updated On : August 13, 2020 / 09:51 AM IST
    Follow us on


    నట సింహం అని గొప్పగా పిలిపించుకునే బాలయ్య బాబు, ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సింహం లాంటి సినిమా చేస్తున్నానని అంటున్నాడు. కాకపోతే, ఈ సింహానికి హీరోయిన్ మాత్రం దొరకడం లేదు. పాపం హీరోయిన్ ఫిక్స్ చేయకుండానే కరోనాకి ముందు ఈ మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ ని కూడా పూర్తిచేశారు. ఏమైనా అప్పటి నుండి బాలయ్యకి హీరోయిన్ దొరకలేదు. నిజానికి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందు నుంచే, చాలామంది హీరోయిన్ల పేర్లు బాలయ్యకి జోడీగా తెరపైకొచ్చాయి, వెళ్ళాయి. కానీ బాలయ్య మాత్రం సినిమాలో ఇంకా సింగిల్ గానే ఉన్నాడు.

    Also Read: పవన్ ఫ్యాన్స్ కి తీవ్ర నిరాశే !

    ఇక ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో బోయపాటి హీరోయిన్ గురించి చెబుతూ.. ఈ సినిమాతో కొత్త హీరోయిన్ ను పరిచయం చేయబోతున్నామని విస్పష్టంగా ప్రకటించినప్పటికీ.. ఆ కొత్త హీరోయిన్ గురించి ఇంకా అడ్రెస్ లేదాయే. బాలయ్య పక్కన చేస్తే ఒక్క సినిమాకే పాత హీరోయిన్ అయిపోతానని భయపడి సైడ్ అయిందో ఏమో గాని, ఇప్పుడు ఆ కొత్త హీరోయిన్ ప్లేస్ లో లావణ్య త్రిపాఠి వచ్చి చేరింది. అమలాపాల్ లాంటి హీరోయిన్ల పేర్లు కూడా వినిపించినా.. బోయపాటి లావణ్య త్రిపాఠి వైపే మొగ్గు చూపాడట. లావణ్య ప్రస్తుతం సినిమా కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తూ ఉంది.

    Also Read: కరోనాలో కూడా లవ్ సీన్స్ కోసం.. !

    పాపం బాలయ్య సినిమా కోసం పేరున్న, క్రేజ్ ఉన్న హీరోయిన్లను తీసుకుందామంటే కనీసం ఒక్కరు కూడా బాలయ్య సినిమా చేయడానికి ముందుకు రావట్లేదు. బాలయ్యే స్వయంగా నయనతారకు ఫోన్ చేస్తే.. ముందు జాలి పడి చేస్తా అన్నా, అ తరువాత తన ప్రియుడితో గడిపే ఏకాంతానికి ఎక్కడ సినిమా అడ్డు వస్తోందో అని.. చివరకి ఈ సినిమా చేయలేనని సైలెంట్ గా తప్పుకుంది. ఇక లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ అన్నీ అనుకున్నట్టు జరిగితే అక్టోబర్ నుంచి తిరిగి షూటింగ్ మొదలవుతుందట.