https://oktelugu.com/

ఏకంగా రాష్ట్రపతి కంట్లో పడ్డ వైసీపీ…! ఇక చిక్కులు తప్పవా…?

కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన శిరోముండనం కేసు లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు జరిగిన అవమానంపై రాష్ట్రపతి కార్యాలయానికి బాధితుడు రాసిన లేఖకు ఏకంగా రాష్ట్రపతి స్పందించారు. వెంటనే అతడిని ఏపీ సాధారణ పరిపాలన శాఖ లో అసిస్టెంట్ సెక్రటరీ గా పనిచేస్తున్న జనార్ధన్ ను కలవాలని సూచించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నేతల ప్రోద్బలం తో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : August 13, 2020 / 10:43 AM IST
    Follow us on

    కొద్ది రోజుల క్రితం తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన శిరోముండనం కేసు లో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. తనకు జరిగిన అవమానంపై రాష్ట్రపతి కార్యాలయానికి బాధితుడు రాసిన లేఖకు ఏకంగా రాష్ట్రపతి స్పందించారు. వెంటనే అతడిని ఏపీ సాధారణ పరిపాలన శాఖ లో అసిస్టెంట్ సెక్రటరీ గా పనిచేస్తున్న జనార్ధన్ ను కలవాలని సూచించారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నేతల ప్రోద్బలం తో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే దీనికి కారకులైన అధికార పార్టీ నేతల పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు వరప్రసాద్ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లేఖ రాశారు.

    వివరాల్లోకి వెళితే…. గత నెల 20న తూర్పుగోదావరి జిల్లా సీతానగరం లో వరప్రసాద్ అనే దళిత యువకుడిపై స్థానిక పోలీస్ స్టేషన్లో తీవ్రమైన దాడి జరిగింది. ఇక పోలీసుల సమక్షంలో అతడిని కొట్టడమే కాకుండా పోలీసులే అతనికి స్టేషన్ హౌస్ ఆఫీసర్ సమక్షంలో శిరోముండనం చేశారు. అయితే ఇందుకు సంబంధించి జగన్ తో పాటు డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్రంగా స్పందించి ఎస్సై ను సస్పెండ్ చేశారు. అయితే బాధితుడు లేఖలో తనపై దాడికి పాల్పడిన ఘటనలో పోలీసులు కొందరు వ్యక్తులపై కేసులు నమోదు చేశారని…. వీరిలో A1 నుంచి A6 వరకు ఇసుక మాఫియాకు చెందినవారని బాధితుడు రాష్ట్రపతికి వివరించడం జరిగింది. వారు అందరినీ వదిలేసి A7 అయిన ఎస్సై ను మాత్రమే అరెస్టు చేసి జైలుకు పంపించారని…. అసలైన నిందితులు అధికార బలంతో తప్పించుకున్నారని.. వారిని ఇంతవరకు అరెస్టు చేయలేదని అందులో పేర్కొన్నారు.

    ఇంకా మరింత విస్తుపోయేలా 48 గంటలకు ముందే అక్కడ డ్యూటీ లో చేరిన ఎస్ఐకి తనపై ఇలాంటి సొంత కక్ష లేకపోయినా…. అతనికి కోరుకున్న చోటకి పోస్టింగ్ ఇప్పిస్తామని ప్రలోభపెట్టి వైసీపీ నేతలే తనపై దాడి చేయించారని వరప్రసాద్ పేర్కొన్నాడు… అలాగే మంత్రులతో సహా పలువురు అధికార పార్టీ నాయకులు తన వద్దకు వచ్చి డబ్బులిస్తాం కేసుని ఉపసంహరించుకోవాలని సూచించిచారే గాని కానీ ఒక్కరు కూడా న్యాయం చేస్తామని హామీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తాను నక్సలైట్లలో కలిసేందుకు అనుమతి ఇవ్వాలని.. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఇంతకు మించిన మార్గం లేదని తాను భావిస్తున్నట్లు అందులో పేర్కొనడం పెద్ద సంచలనానికి దారితీసింది.

    దీంతో రాష్ట్రపతి కోవింద్ వెంటనే స్పందించారు. దళితుడైన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అతని బాధను అర్థం చేసుకుని వెంటనే ఆయనకి సహాయపడ్డారు. అయితే వైసీపీ పార్టీ ఇప్పటికే దేశంలో అత్యధిక శాతంలో నేర చరిత్ర ఉన్న నాయకులు కలిగిన పార్టీల లిస్టులో టాప్ స్థానంలో ఉండగా…. ఇటువంటి ఘటనలు మళ్లీ వారి పార్టీ నేతాల నుండే జరుగుతుండడం దురదృష్టకరం. దీంతో రాష్ట్రపతి కన్ను కూడా ఒక్కసారిగా ఏపీ అధికార పార్టీపై పడింది. ఇక రానున్న రోజుల్లో వారికి చిక్కులు తప్పవు అని రాష్ట్రపతి భవన్ లోని మాట.