Afghanistan: మహిళలకు సపోర్టు చేశారని జర్నలిస్టులపై తాలిబన్ల దారుణం.. ఏం చేశారంటే?

Afghanistan: అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. తాలిబన్ల ప్రభుత్వం కొలువుదీరగానే మహిళలపై ఉక్కుపాదం మోపారు. అనంతరం స్వేచ్ఛగా గళం విప్పిన వారిని అణిచివేయడం మొదలుపెడుతున్నారు. చాలా మంది జర్నలిస్టులను , అమెరికాకు సాయం చేసిన వారిని , కళాకారులను వెతికి మరీ చంపిన తాలిబన్లు.. తాజాగా మహిళలకు సపోర్టుగా వార్తలు రాసిన జర్నలిస్టుల చర్మం వలిచేశారు. స్వేచ్ఛ కోసం పోరాడుతోన్న మహిళలను ఎక్కడిక్కడ అణిచివేస్తున్న తాలిబన్లు.. ఆ ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపైనా కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. […]

Written By: NARESH, Updated On : September 9, 2021 4:59 pm
Follow us on

Afghanistan: అప్ఘనిస్తాన్ లో తాలిబన్ల అరాచకం కొనసాగుతోంది. తాలిబన్ల ప్రభుత్వం కొలువుదీరగానే మహిళలపై ఉక్కుపాదం మోపారు. అనంతరం స్వేచ్ఛగా గళం విప్పిన వారిని అణిచివేయడం మొదలుపెడుతున్నారు. చాలా మంది జర్నలిస్టులను , అమెరికాకు సాయం చేసిన వారిని , కళాకారులను వెతికి మరీ చంపిన తాలిబన్లు.. తాజాగా మహిళలకు సపోర్టుగా వార్తలు రాసిన జర్నలిస్టుల చర్మం వలిచేశారు.

స్వేచ్ఛ కోసం పోరాడుతోన్న మహిళలను ఎక్కడిక్కడ అణిచివేస్తున్న తాలిబన్లు.. ఆ ఆందోళనలను కవర్ చేస్తున్న జర్నలిస్టులపైనా కర్కశత్వం ప్రదర్శిస్తున్నారు. అత్యంత దారుణంగా వారిని హింసిస్తున్న దృశ్యాలు, వీడియోలను విడుదల చేశారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు జర్నలిస్టుల ఫొటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పశ్చిమ కాబూల్ లోని కర్తే ఛార్ ప్రాంతంలో తాలిబన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొందరు మహిళలు బుధవారం ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనను అడ్డుకున్న తాలిబన్లు దీన్ని కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధులపైనా దాడులకు తెగబడ్డారు.

అఫ్టాన్ మీడియా సంస్థ ఎట్లియాట్రోజ్ కు చెందిన వీడియో ఎడిటర్ తాఖీ దర్యాబీ, రిపోర్టర్ నెమతుల్లా నక్డీలను తాలిబన్లు తీసుకెళ్లి వారి పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఎంతగా హింసించారో ఆ ఫొటోలు బయటకు లీక్ కావడంతో బీతావాహంగా ఉన్నాయి. ఇంత తీవ్రంగా కొట్టారా? అని జర్నలిస్టులు, ప్రపంచంలోని ప్రజలంతా షాక్ అవుతున్నాయి. చర్మ వలిచేసి వారిని విడిచిపెట్టినట్టుగా తెలుస్తోంది. శరీరంపై తీవ్ర గాయాలతో ఉన్న జర్నలిస్టుల ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.