Osho: ఆచార్య రజనీష్, భగవాన్ శ్రీ రజనీష్.. ఈ పేర్ల కంటే కూడా ఓషో గానే ఆయన సుపరిచితుడు. 1931 డిసెంబర్ 11న మధ్యప్రదేశ్లో జన్మించిన అతని పూర్తి పేరు చంద్రమోహన్ జైన్. ఓషో చనిపోయి 34 సంవత్సరాలు పూర్తయినప్పటికీ.. ఇప్పటికీ ఆయన రాసిన పుస్తకాలు ఒక ట్రెండ్ సెట్టర్. పాత విధానాలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించిన ఆయన.. అనేక వివాదాస్పద నిర్ణయాలకు శ్రీకారం చుట్టారు. తన ఆశ్రమంలో అటువంటి వాటిని ప్రోత్సహించారు. ఇంతకీ నాడు ఆయన ఆశ్రమంలో ఏం జరిగేవి.. భారతీయులను ఎందుకు ఆయన దూరం పెట్టారు.. విదేశీయుల విషయంలో ఎందుకంత చొరవ చూపారు.
ఓషో.. మతం, తాత్వికత, సంప్రదాయం వంటి వాటికి దూరంగా ఉన్నారు. సాధారణ బాలుడి లాగానే పెరిగినప్పటికీ.. ప్రశ్నించడం, ప్రయోగాలు చేయడం వంటివి ఆయనను భిన్నమైన వ్యక్తిగా మలిచాయి. ఆ తర్వాత ప్రజల పట్ల.. వారి వ్యవహార శైలి పట్ల ఆయనకు ఆసక్తి ఉండేది. ఆ వ్యవహార శైలి కాలేజీ బహిష్కృతుడిని చేసింది. ఆ తర్వాత అతి కష్టం మీద చదువులు పూర్తి చేసి 1957లో రాయ్ పూర్ లో సంస్కృత విశ్వవిద్యాలయంలో తన ఉద్యోగ జీవితాన్ని ఓషో ప్రారంభించారు. ఇదే సమయంలో దేశం మొత్తం పర్యటించడం మొదలుపెట్టారు. మతం, శృంగారం గురించి వివాదాస్పద ప్రసంగాలు చేసేవారు.. కొద్దిరోజులకు తన ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి గురువుగా మారారు. 1969 లో తన ప్రధాన కార్యాలయాన్ని ముంబైలో ఏర్పాటు చేశారు. మదర్ యోగ లక్ష్మి ఆయనకు ముఖ్య సహాయకురాలిగా ఉండేది. 1981 వరకు ఆమె కొనసాగింది. ఓషో బహిరంగంగా లైంగిక స్వేచ్ఛ గురించి మాట్లాడేవారు. అత్యంత వివాదాస్పద విషయాలను కూడా తనదైన భాషలో చెప్పి ప్రజలను ఆకర్షించేవారు. “ఓషో భారతదేశంలో పుట్టిన అత్యంత ఆలోచనాపరుడు. ఆయనకు శాస్త్రీయ దృక్పథం ఎక్కువ. వినూత్నమైన భావాలు కలిగిన వ్యక్తి.. ఆయన పుస్తకాలు చదివితే 20వ శతాబ్దపు గొప్ప ఆధ్యాత్మిక గురువు.. ఆయన గురించి లోతుగా అధ్యయనం చేస్తే జీవితం సారం అర్థమవుతుందని” ప్రముఖ రచయితలు కుశ్వంత్ సింగ్, టామ్ రాబిన్స్ వ్యాఖ్యానించారంటే కారణమిదే.
మదర్ ఆనంద్ షీలా ఓషో కార్యదర్శిగా చాలా సంవత్సరాల పాటు పని చేశారు. ఆమెను ఓషో మదర్ అని పిలిచేవారు..” అప్పట్లో నేను ఆయన గదిలోకి వెళ్లాను. ఓషో నవ్వారు. తన చేతులను ఇలా చాచితే.. నేను ఆయన కౌగిలిలో బందీ అయ్యాను. తన ఛాతికి గట్టిగా హత్తుకున్నారు. అంతే ఒడుపుగా చేయి పట్టుకున్నారు. నేను ఆయన భుజాలపై నా తలపెట్టాను. ఆ తర్వాత చాలాసేపటి దాకా గదిలో మౌనమే. ఆ తర్వాత రేపు మళ్లీ ఇదే సమయానికి నన్ను కలిసేందుకు రా అంటూ ఆయన నాకు చెప్పారని” షీలా రాసిన తన ఆత్మ కథ “డోంట్ కిల్ హిమ్, ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ విత్ భగవాన్ రజనీష్” లో ప్రముఖంగా ప్రస్తావించారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఓషో ఆశ్రమంలో ఏం జరిగిందనేది.. “విన్ మెక్ కార్ మాక్” రాసిన “ది రజనిష్ క్రానికల్” అనే పుస్తకం అప్పట్లో వివాదాస్పదమైంది. దీనిని నిషేధించాలని పార్లమెంట్లో చర్చలు కూడా జరిగాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఓషో తన ఆశ్రమాన్ని ముంబై నుంచి పూణేకి మార్చిన తర్వాత.. అక్కడ సె* థెరఫీ గురించి ప్రధానంగా చర్చించేవారు.. దీనివల్ల రోజూ ఆయన ఆశ్రమానికి ఆ రోజుల్లోనే 5000 మంది వచ్చేవారట. ఆయన ఆశ్రమం వల్ల పూణే ప్రాంతానికి పర్యాటకం పెరిగింది. సె* థెరఫీ ఇవ్వడం వల్ల డబ్బు విపరీతంగా రావడం మొదలు పెట్టింది. తన ఆశ్రమంలో ఓషో ఓషో లైంగిక స్వేచ్ఛను విపరీతంగా ఇచ్చేవారు. నైతికతకు, కట్టుబాట్లను ఆమోదించేవారు కాదు. అయితే ఆశ్రమంలో పిల్లలను కారణానికి ఓషో ఒప్పుకునే వారు కాదు. పైగా లైంగిక భాగస్వాములను తరచుగా మార్చుకోవడాన్ని ఆయన ప్రోత్సహించేవారు. ఇలా తన ఆశ్రమంలో వివాదాస్పద నిర్ణయాలను ప్రోత్సహించి.. ఆయన అనేకమంది సాధువులకు శత్రువు అయ్యారు.
సె* థెరఫీ వల్ల విదేశీ పర్యాటకుల రాక పెరిగింది. పూణే ఆశ్రమం విస్తీర్ణం కూడా విస్తరించింది. అక్కడ వైద్య కేంద్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. వైద్యులు, నర్సులు అక్కడ ఉండేవారు. విశృంఖలమైన శృంగారం వల్ల ఆశ్రమానికి చెందిన వారిని గర్భనిరోధక శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని ఓషో ముందుగానే చెప్పేవారు. బహిరంగ లైంగిక జీవితం వల్ల చాలామంది మహిళలు అంటువ్యాధులకు గురయ్యేవారు. ఒక నెలలో తక్కువలో తక్కువ కొంతమంది సన్యాసులు, సన్యాసినులు 90 దాకా లైంగిక సంబంధాలు పెట్టుకునే వారట. ఈలోగా ఓషో తరచూ అనారోగ్యానికి గురయ్యేవాడు. అలర్జీలు, ఉబ్బసం, నడుము నొప్పి తీవ్రమయ్యాయి. ఈలోగా ఓషో తన ఆశ్రమాన్ని అమెరికాలో ఏర్పాటు చేయాలని అనుకున్నారు. వీసా నిబంధనలు అతిక్రమించారనే నెపంతో ఆయన 17 రోజుల పాటు అక్కడి జైల్లో ఉన్నారు. దీంతో ఆయన ఇండియాకు రాక తప్పలేదు. చివరికి జనవరి 1990 లో 58 ఏళ్ల వయసులో ఓషో కన్నుమూశాడు. ఓ గురువుగా వివాదాస్పద అంశాలను ఎంచుకున్న ఓషో, చివరి వరకు తన దారిని మార్చుకోలేదు. అప్పట్లో రాజీవ్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఓషో నే కారణమనే వాదనలు కూడా ఉన్నాయి. కొంతమంది విమర్శించవచ్చు, మరికొంతమంది స్వాగతించవచ్చు. చనిపోయి ఇన్ని సంవత్సరాలయినప్పటికీ…ఓషో వార్తల్లో వ్యక్తినే. అందులో ఎటువంటి సందేహం లేదు.