https://oktelugu.com/

ఒక్కరోజులోనే 10 వేల బుకింగ్ లు.. ఆ ఒక్క ఫీచర్ తోనే కొత్త స్విప్ట్ కు ఫిదా..

మారుతి కంపెనీ చెప్పినట్లుగానే కొత్త స్విప్ట్ లో విభిన్న ఫీచర్లను అమర్చింది. దీని డిజైన్ స్పోర్ట్స్ కారు వలె ఉండడంతో మరింత ఆకర్షిస్తుంది. బాడీ పార్ట్స్ మొత్తం కొత్త కలర్లలో ఉండడంతో హుందాగా కనిపిస్తుంది. కొత్త స్విప్ట్ రెడ్, వైట్ లైన్స్, బానెట్ నలుపు వంటి రంగులు ఆకర్షించనున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : May 12, 2024 9:52 am
    Maruthi Swift New Zen

    Maruthi Swift New Zen

    Follow us on

    మారుతి నుంచి ఇటీవల రిలీజ్ అయిన కొత్త స్విప్ట్ గురించి ఆసక్తి చర్చ సాగుతోంది. ఈ కంపెనీకి చెందిన పాత స్విప్ట్ ఇప్పటికే సంచలనాలు సృష్టించింది. ఇప్పుడు కొత్త దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అనుకున్నట్లుగానే స్విప్ట్ న్యూ జెన్ లో ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా ఇది రేసింగ్ రోడ్ స్టర్ ఎడిషన్ లో ఉండడంతో రేసింగ్ ప్రియులు దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ కొత్త స్విప్ట్ లో ఎలాంటి స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం..

    మారుతి కంపెనీ చెప్పినట్లుగానే కొత్త స్విప్ట్ లో విభిన్న ఫీచర్లను అమర్చింది. దీని డిజైన్ స్పోర్ట్స్ కారు వలె ఉండడంతో మరింత ఆకర్షిస్తుంది. బాడీ పార్ట్స్ మొత్తం కొత్త కలర్లలో ఉండడంతో హుందాగా కనిపిస్తుంది. కొత్త స్విప్ట్ రెడ్, వైట్ లైన్స్, బానెట్ నలుపు వంటి రంగులు ఆకర్షించనున్నాయి. ఎక్సీటీరియర్ తో పాటు ఇంటీరియర్ ఆకర్షణీయంగా ఉంది. డ్యాష్ బోర్డ్, సీట్లతో పాటు ఎంట్రన్స్ వంటివి ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

    ఇక కొత్త స్విప్ట్ లో స్పోర్ట్స్ కారులో ఉన్న విధంగా రేసింగ్ రోడ్ స్టర్ ను ఉంచారు. దీంతో సాధారణ స్విప్ట్ కంటే రోడ్ స్టర్ ఎడిషన్ స్పోర్ట్స్ కారు ప్రియులకు బాగా నచ్చుతుంది. అయితే రోడ్ స్టర్ ను అమర్చినప్పటికీ ఇందులో కాస్మోటిక్ వర్క్ మినహా పాత స్విప్ట్ తో ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తుంది. కొత్త స్విప్ట్ లో జడ్ సిరీస్ ఇంజిన్ ను ఉపయోగించారు. కొత్త స్విప్ట్ లో 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజిన్ ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ తో ఇది 25.75 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో సేప్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఉన్నాయి.

    బెస్ట్ ఫీచర్ష్ తో పాటు రేసింగ్ రోడ్ స్టర్ ఆకట్టుకోవడంతో ఈ మోడల్ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే అమ్మకాలు విపరీతమయ్యాయి. ఒక్కరోజులోనే ఇది 10 వేల బుకింగ్ లు కావడం విశేషం. స్విప్ట్ న్యూ జెన్ మొత్తం 5 వేరియంట్లలో లభ్యం కానుంది. దీని ధర రూ.6.49 లక్షల ప్రారంభం నుంచి రూ.9.65 లక్షల వరకు విక్రయిస్తున్నారు. పాత స్విప్ట్ కంటే కొత్త స్విప్ట్ రూ.30,900 నుంచి రూ.40,500 ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు.