ట్రంప్ కు షాక్: హెచ్‌-1 బీ వీసాపై కోర్టుకు ప్రముఖులు

అమెరికాలో వీసాను కఠినతరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొత్త విధానంతో అమెరికా వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని 17 మంది ప్రముఖులు, సంస్థలు కొలంబియా జిల్లా కోర్టులో వ్యాజ్యం వేశారు. వీటిలో పలు విశ్వవిద్యాలయాలు, వాణిజ్య సంస్థలు, ఆసుపత్రులు తదతర సంస్థల యజమానులు ఉన్నారు. Also Read: జనసేనాని ప్రజల్లోకి రాకపోవడమేంటి..? వచ్చే ఎన్నికల్లో గెలుపై లక్ష్యంగా ముందుకెళ్తున్న ట్రంప్‌ స్థానికులకు ఉద్యోగులకు కల్పించడానికి హెచ్‌-1 బీ వీసాపై ఆంక్షలు […]

Written By: NARESH, Updated On : October 20, 2020 4:56 pm
Follow us on

అమెరికాలో వీసాను కఠినతరం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అక్కడి కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కొత్త విధానంతో అమెరికా వ్యవస్థకు తీవ్ర నష్టం జరుగుతుందని 17 మంది ప్రముఖులు, సంస్థలు కొలంబియా జిల్లా కోర్టులో వ్యాజ్యం వేశారు. వీటిలో పలు విశ్వవిద్యాలయాలు, వాణిజ్య సంస్థలు, ఆసుపత్రులు తదతర సంస్థల యజమానులు ఉన్నారు.

Also Read: జనసేనాని ప్రజల్లోకి రాకపోవడమేంటి..?

వచ్చే ఎన్నికల్లో గెలుపై లక్ష్యంగా ముందుకెళ్తున్న ట్రంప్‌ స్థానికులకు ఉద్యోగులకు కల్పించడానికి హెచ్‌-1 బీ వీసాపై ఆంక్షలు విధించాలని నిర్ణయించాడు. ఈమేరకు ‘డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంలాండ్‌ సెక్యూరిటీ (టీహెచ్‌ఎస్‌)’ ఇటీవల ఓ నోటీఫికేషన్‌ జారీ చేసింది. ఈ వీసాల పరిధిలోకి వచ్చే నైపుణ్యాలను కుదించింది. పాత వీసా విధానంలోని లొసుగులను తాజా మార్పులు సరిదిద్దుతాయని టీహెచ్‌ఎస్‌ అభిప్రాయపడింది.

కోవిడ్‌-19 సంక్షోభంలో ఇలాంటి నిర్ణయాలు సరికావని పలువురు వ్యాపార సంస్థలు అభిప్రాయపడుతున్నాయి. ‘హెచ్‌-1 బీ’ వీసాతో నిపుణులైన విదేశీయులను ఉద్యోగాల్లో నియమించుకునేందుకు ఉపయోగపడుతుంది. దీని ద్వారా భారత్‌, చైనా తదితర దేశాల నుంచి ఐటీ, ఇతర రంగాల వారు అమెరికాలో పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ‘హెచ్‌-1బీ’ నిబంధనలను పలు కంపెనీలు దుర్వినియోగం చేస్తున్నాయని ట్రంప్ మండిపడుతున్నారు. ఇప్పటికే అమెరికా ఉద్యోగాలను విదేశీయులకు కట్టబెడుతున్నారని ఆరోపణలు చేస్తున్న ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా వీసాల జారీపై ఆంక్షలు విధించారు.

Also Read: బ్రేకింగ్: 6 గంటలకు ప్రజల ముందుకు మోడీ.. ఏం చెప్తారు?

ఈ కొత్త నిర్ణయాల వల్ల ప్రభుత్వానికే నష్టం జరుగుతుందని, ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని 17 మంది ఆ దేశ ప్రముఖులు కోర్టుకెక్కడం చర్చనీయాంశంగా మారింది. అసలే వచ్చే నెలలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వీసాలపై ట్రంప్ సర్కార్ వెనుకడుగు వేస్తుందా..? లేదా.? అనేది ప్రాధాన్యత సంతరించుకుంది.