https://oktelugu.com/

బాలయ్యతో పెట్టుకున్న బోయపాటి.. ఇక దబిడిదిబిడేనా..?

నందమూరి నటసింహ బాలకృష్ణ తాజా చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘సింహా’.. ‘లెజండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలు వచ్చాయి. దీంతో వీరద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హట్రిక్ మూవీపై నందమూరి ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు. Also Read: ‘రాధేశ్యామ్’పై కాపీ మరక.. కౌంటర్ ఇవ్వరా? ఈ మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో అన్ని సినిమాల్లానే ఇదికూడా వాయిదా పడింది. అయితే ఇటీవల టాలీవుడ్లో మళ్లీ సినిమాల […]

Written By: , Updated On : October 20, 2020 / 04:10 PM IST
Follow us on

Balakrishna-focus on Market

నందమూరి నటసింహ బాలకృష్ణ తాజా చిత్రాన్ని దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ‘సింహా’.. ‘లెజండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీలు వచ్చాయి. దీంతో వీరద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న హట్రిక్ మూవీపై నందమూరి ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

Also Read: ‘రాధేశ్యామ్’పై కాపీ మరక.. కౌంటర్ ఇవ్వరా?

ఈ మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో కరోనా ఎంట్రీ ఇవ్వడంతో అన్ని సినిమాల్లానే ఇదికూడా వాయిదా పడింది. అయితే ఇటీవల టాలీవుడ్లో మళ్లీ సినిమాల సందడి మొదలైంది. కరోనా ఎఫెక్ట్.. అకాల వర్షాల కారణంగా సీనియర్ హీరోలైన చిరంజీవి, వెంకటేశ్ ఇప్పట్లో షూటింగులకు మొగ్గుచూపడం లేదు.

సీనియర్ హీరోల్లో కింగ్ నాగార్జున తన ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగు కోసం ఇటీవలే కూలుమానాలి వెళ్లాడు. బాలకృష్ణ సైతం తన మూవీలో పాల్గొనేందుకు ఉత్సాహం చూపుతున్నారు. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను షూటింగుకు రెడీ లేడని తెలుస్తోంది. బోయపాటి కారణంగా బాలయ్య వెయిట్ చేయాల్సి వస్తుందనే టాక్ ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది.

బోయపాటి సినిమాలో బాలయ్య డబుల్ రోల్ చేస్తున్నాడు. అయితే ఈ మూవీలో హీరోయిన్ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవలే ఓ హీరోయిన్ పేరు తెరపైకి వచ్చినా అధికారికంగా చిత్రయూనిట్ ప్రకటించ లేదు. అలాగే సినిమాలో విలన్ ఎవరో స్పష్టతలేదు. అలాగే నటీనటులు.. సాంకేతిక నిపుణులపై ఇంకా క్లారిటీ రావడం లేదు.

Also Read: టాలీవుడ్ బుట్టబొమ్మ.. బాలీవుడ్లో ‘సర్కస్’ చేయనుందా?

ఈ కారణంగానే సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. అన్ని సజావుగా జరిగే దసరా తర్వాత సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందనే టాక్ విన్పిస్తోంది. ఏదిఏమైనా బోయపాటి కారణంగా బాలయ్య వెయిట్ చేస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. బాలయ్యతో పెట్టుకుంటే ఎవరికైనా దబిడి.. దిబిడేనని ఇండస్ట్రీలో టాక్ ఉంది. తెలిసి తెలిసి బోయపాటి ‘సింహం’ నోట్లో తలపెడుతుండటం ఆసక్తిని రేపుతోంది.