https://oktelugu.com/

నిమ్మగడ్డకు షాక్.. హైకోర్టు సంచలన తీర్పు

ఒక తీర్పులో ప్రభుత్వానికి షాక్‌.. మరో కేసు తీర్పులో ఎస్‌ఈసీకి షాక్‌.. ఏపీలో జరుగుతున్న తంతు ఇదీ. నిత్యం ఈ వార్తలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి స్టేట్‌లో. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వర్సెస్‌ ఎస్‌ఈసీ అన్నట్లుగా యుద్ధం నడుస్తోంది ఆ రాష్ట్రంలో. తాజాగా.. హైకోర్టు ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు పెద్ద షాక్‌ ఇచ్చింది. మున్సిపల్‌ ఎన్నికల్లో రీ నామినేషన్లకు అనుమతిస్తూ ఎస్ఈసీ జారీ చేసిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది.. కొత్తగా నామినేషన్లు వేయడానికి అవకాశం లేదని చెప్పింది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 3, 2021 1:23 pm
    Follow us on

    Nimmagadda
    ఒక తీర్పులో ప్రభుత్వానికి షాక్‌.. మరో కేసు తీర్పులో ఎస్‌ఈసీకి షాక్‌.. ఏపీలో జరుగుతున్న తంతు ఇదీ. నిత్యం ఈ వార్తలు హాట్‌ టాపిక్‌ అయ్యాయి స్టేట్‌లో. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం వర్సెస్‌ ఎస్‌ఈసీ అన్నట్లుగా యుద్ధం నడుస్తోంది ఆ రాష్ట్రంలో. తాజాగా.. హైకోర్టు ఎస్‌ఈసీ నిమ్మగడ్డకు పెద్ద షాక్‌ ఇచ్చింది. మున్సిపల్‌ ఎన్నికల్లో రీ నామినేషన్లకు అనుమతిస్తూ ఎస్ఈసీ జారీ చేసిన ఆదేశాలను కోర్టు కొట్టివేసింది.. కొత్తగా నామినేషన్లు వేయడానికి అవకాశం లేదని చెప్పింది.

    Also Read: పత్రికపై రామోజీరావు సంచలన నిర్ణయం.. మీడియా వర్గాల షాక్

    అంతేకాదు.. వాలంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవాలన్న ఆదేశాలనూ హైకోర్టు కొట్టివేసింది. తిరుపతి, పుంగనూరు, రాయచోటి, ఎర్రగుంట్లలో 14 వార్డులకు రీ నామినేషన్లకు ఎస్ఈసీ అవకాశం కల్పించింది. అలాగే వాలంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఈ నిర్ణయాలను జగన్ సర్కార్ కోర్టులో సవాల్ చేయగా ఆదేశాలను కొట్టేసింది.

    చిత్తూరు జిల్లా తిరుపతిలో 6, పుంగనూరులో 3, కడప జిల్లా రాయచోటిలో 2, ఎర్రగుంట్ల 3 వార్డుల్లో మళ్లీ నామినేషన్లు వేసేందుకు అవకాశం కల్పించారు. తిరుపతి కార్పొరేషన్‌లోని 2, 8, 10, 21, 41, 45 వార్డులకు.. పుంగనూరులోని 9, 14, 28 వార్డులు, రాయచోటిలోని 20, 31 వార్డులు, ఎర్రగుంట్లలోని 6, 11, 15 వార్డుల్లో నామినేషన్ల దాఖలుకు ఎస్‌ఈసీ అనుమతించారు. వార్డు వాలంటీర్లను మున్సిపల్ ఎన్నికలకు దూరంగా ఉండాలని.. మొబైల్స్ స్వాధీనం చేసుకోవాలని ఎస్ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టులో ప్రభుత్వం సవాల్ చేసింది. ఎస్ఈసీ ఆదేశాలపై లంచ్ మోషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు తీర్పు ఇచ్చింది.

    Also Read: ఆపరేషన్‌ ఆకర్ష్‌ బీజేపీకే నష్టం తేనుందా..!

    మరోవైపు మున్సిపల్ ఉపసంహరణపై కలెక్టర్లకు నిమ్మగడ్డ తాజా ఆదేశాలు జారీ చేశారు. అభ్యర్థి లేకుండా నామినేషన్లు ఉపసంహరణ చేయొద్దని.. ఉపసంహరణల ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీయాలని ఆదేశించారు. బెదిరించి, భయపెట్టి ఉపసంహరణలు చేశారంటూ పార్టీల ఫిర్యాదులు వచ్చాయని.. నిన్న భారీ ఉపసంహరణలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మొత్తంగా ఇప్పుడు మున్సిపల్‌.. మున్ముందు పరిషత్‌ ఎన్నికలు ముగిసే సరికి హైకోర్టులో ఇంకా ఎన్ని పిల్స్‌ దాఖలవుతాయో.. మరెన్ని షాక్‌లు తగులుతాయో తెలియకుండా ఉంది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం, ఎస్‌ఈసీ కలిసి వెళ్లేందుకు మాత్రం ప్రయత్నించకపోవడం ఇబ్బందికర విషయమేనని నిపుణులు అంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్