https://oktelugu.com/

షర్మిల పార్టీలోకి ప్రముఖ నేత.. ఎవరో తెలిస్తే షాక్?

అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్‌ షర్మిల తండ్రి వారసత్వంతో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అన్న జగన్‌తో విభేదించి తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్న క్రమంలో.. షర్మిల కూడా ఆ విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేశారు. తాను పార్టీ పెట్టడం జగనన్నకు ఇష్టం లేదని బాంబు పేల్చారు. నిన్న తాజాగా.. ఏప్రిల్‌లోనే పార్టీ ప్రకటించబోతున్నట్లు చెప్పారు. దీంతో ఆమె వెంట నడిచే వారెవరు..? ఆమెకు అండగా నిలిచేవారు ఎవరు..? అంటూ అప్పుడే ఆసక్తికర […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 3, 2021 1:38 pm
    YS Sharmila
    Follow us on

    Indira Shobhan Sharmila
    అనూహ్యంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్‌ షర్మిల తండ్రి వారసత్వంతో కొత్త పార్టీ పెట్టబోతున్నారు. అన్న జగన్‌తో విభేదించి తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లుగా పలువురు ఆరోపిస్తున్న క్రమంలో.. షర్మిల కూడా ఆ విషయంపై ఇప్పటికే ఓ క్లారిటీ ఇచ్చేశారు. తాను పార్టీ పెట్టడం జగనన్నకు ఇష్టం లేదని బాంబు పేల్చారు. నిన్న తాజాగా.. ఏప్రిల్‌లోనే పార్టీ ప్రకటించబోతున్నట్లు చెప్పారు. దీంతో ఆమె వెంట నడిచే వారెవరు..? ఆమెకు అండగా నిలిచేవారు ఎవరు..? అంటూ అప్పుడే ఆసక్తికర చర్చ అయితే నడుస్తోంది.

    Also Read: పత్రికపై రామోజీరావు సంచలన నిర్ణయం.. మీడియా వర్గాల షాక్

    ఇదిలా ఉండగా.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో అడుగుపెడుతున్న షర్మిల పార్టీలోకి ఓ కీలక మహిళ నేత వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు ప్రకటనకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ నడుస్తున్నట్లు ఇటీవలే షర్మిల తెలిపారు. ఈ క్రమంలో షర్మిలతో వరుసగా ప్రముఖ నేతలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు భేటీ అవుతున్నారు. తాజాగా కాంగ్రెస్ నేత ఇందిరా శోభన్ షర్మిల పెడుతున్న పార్టీలోకి వెళ్తారన్న టాక్‌ వినిపిస్తోంది.

    ఇప్పటికే ఇందిరా కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. పీసీసీ అధికార ప్రతినిధి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఏడేళ్లుగా తనకు అండగా ఉన్న కార్యకర్తలు, నేతలు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు చెప్పారు ఇందిరా శోభన్. కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తీరు తనను బాధించిందని.. వారి వైఖరికి నిరసనగా పార్టీని వీడాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. మహిళా నాయకురాలిగా తీవ్ర ఆవేదన చెందానని వివరించారు.

    Also Read: ఆపరేషన్‌ ఆకర్ష్‌ బీజేపీకే నష్టం తేనుందా..!

    అంతేకాదు.. త్వరలో వైఎస్‌ షర్మిల ప్రకటించబోతున్న కొత్త పార్టీలో చేరబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తానన్నారు. దీంతో వైఎస్ షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ పార్టీ నేత ఇందిరా శోభన్ వెళ్లనున్నారనేది స్పష్టంగా కన్‌ఫాం. రెండు రోజుల క్రితమే షర్మిల అనుచరులతో ఇందిరా శోభన్ సమావేశం అయ్యారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే నేడో, రేపో షర్మిల పెట్టబోయే పార్టీలోకి చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్