
CM KCR: తెలంగాణలో రెండు దశాబ్దాలుగా తిరుగులేని పార్టీగా వెలుగొందుతున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం అన్ని అపజయాలే. టీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ లో వెనుకబడిన సందర్భంలో అందరిలో చులకన అయిపోతోంది. ఒకప్పుడు దర్జాగా ఓ ఠీవీగా వెలిగిన పార్టీ ప్రస్తుతం కష్టాల్లో పడుతోంది. తన ప్రతిష్ట నిలుపుకోవడానికి నానా పాట్లు పడుతోంది. ఈ నేపథ్యంలో నవంబర్ 29న దీక్షా దివస్ ను పురస్కరించుకుని టీఆర్ఎస్ విజయ గర్జన సభ నిర్వహించాలని భావించింది. తొలుత నవంబర్ 15న జరపాలని అనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని నవంబర్ 29కి పొడిగించినట్లు రాష్ర్ట నాయకత్వం తెలిపింది.
ఈ నేపథ్యంలో సభ నిర్వహణ కోసం స్థలం కోసం గాలిస్తున్నారు. ఇందులో భాగంగా హసన్ పర్తి మండలం దేవన్నపేట గ్రామంలో ఓ స్థలం పరిశీలిస్తున్న క్రమంలో అక్కడి రైతులు ఎదురుతిరిగారు. తమ స్థలం ఇవ్వబోమని అధికార పార్టీ నేతలపై వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి రావడం గమనార్హం. దీంతో అధికార పార్టీలో ఆలోచన మొదలైంది.
రైతులు వ్యతిరేకించడంతో పార్టీ నేతల్లో ఆందోళన పెరుగుతోంది. అన్నదాతలు ఒక్కసారిగా పొలం ఇవ్వమని తెగేసి చెప్పడంతో ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ మంత్రి కడియం శ్రీహరి ఖంగుతిన్నారు. రైతుల నుంచి వస్తున్న మాటలకు ఆశ్చర్యపోయారు. సభా నిర్వహణ స్థలంపై ఇంత రాద్ధాంతం జరగడంతో నేతల్లో విచారం వ్యక్తమవుతోంది.
దీనికి ప్రధాన కారణం హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితమే అని తెలుస్తోంది. మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఈటల రాజేందర్ అధికార పార్టీని ఓడించడంతో రైతుల్లో కూడా ఇప్పుడు ప్రభుత్వంపై ఇంత స్థాయిలో వ్యతిరేకత వస్తోందని చర్చించుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీకి సభా స్థలం దొరకకపోవడం విచిత్రమే అంటున్నారు. వీరికి బీజేపీ నేతలు కూడా తోడుగా నిలిచినట్లు తెలుస్తోంది.
Also Read: ఆంధ్రోళ్లకు బిస్కెట్: కేసీఆర్ మళ్లీ ఏసాడు!