Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్‌రాజు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఇంకా కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తోన్న 50వ మూవీ కావడం ఒకటైతే… చరణ్ కు ఇది 15 వ చిత్రం. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ ను చిత్రా బృందం ప్రకటించింది.

తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ షెడ్యూల్‌లో పూనే, సతారా, పాల్‌టన్ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్నట్లు తెలుస్తుంది. పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని గ్రాండియర్ గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అలానే ఎస్.ఎస్.తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
It’s a wrap !!
Completed first schedule of #RC15 in Pune, Satara and Phalton.
Megapower Star @alwaysramcharan and Maverick Director @shankarshanmugh are all set to deliver something very special !!@advani_kiara @DOP_Tirru @MusicThaman @SVC_official#SVC50 pic.twitter.com/PF3FxowYze
— Sri Venkateswara Creations (@SVC_official) November 3, 2021
ఈ సినిమాలో రామ్ చరణ్ ఐఏయస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు సమాచారం. ఓ ఐఏయస్ ఆఫీసర్ రాజకీయాల్లో చేరి ఆ వ్యవస్థలో ఏ విధంగా మార్పు తీసుకొచ్చాడనే కధాంశంతో మూవీ రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ప్రస్తుతం చరణ్…దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తోకలిసి ఆర్ఆర్ఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆచార్య సినిమాలు చేస్తున్నాడు.