100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నడూ చూడని పతనాన్ని ఎదుర్కొంటోంది. పోయిన నేతను నిలువరించలేక.. ఉన్న వారిని కాపాడుకోలేక.. వారిని సహాయ నిరాకరణ చేస్తూ కాలదన్నుతోంది. దీంతో ప్రముఖులైన కాంగ్రెస్ వాదనను వినిపించే వారు కూడా వైదొలుగుతుండడం కలవరపెడుతోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్ లో జ్యోతిరాధిత్య సింధియాను కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తమిళనాట ఫైర్ బ్రాండ్ ఖుష్బూ ను కూడా వదిలేసుకుంది.
తమిళనాడు ఫైర్ బ్రాండ్, ప్రముఖ నటి అయిన కుష్బూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అన్యాయాలను కడిగిపారేస్తుంటారు. ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సామాజిక అంశాలపై గళం ఎత్తుతుంటారు.పార్టీలో కీలక పదవులు కుష్బూకు దక్కాయి.
అయితే ఇటీవల కాంగ్రెస్ లో ఖుష్బూకు అవమానాలు ఎదురయ్యాయి. ఆమెను ఏఐసీసీ ప్రతినిధి హోదా నుంచి తప్పించారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వలేదు. ఈ అంశాలతో మనస్తాపానికి గురైన కుష్బూ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసిన ఖుష్బూ పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపారు. కాంగ్రెస్ పార్టీలో అణిచివేత గురించి ఆమె తన లేఖలో పేర్కొన్నారు. కాంగ్రెస్ లోని కొందరు నేతలు క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి తెలియకుండానే ఆదేశాలు ఇచ్చారని.. ఇది నచ్చకనే కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు కుష్బూ తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న సమయంలో కుష్బూ రాకతో తమిళనాడు రాజకీయాల్లో బీజేపీకి ప్లస్ కాగా.. కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది.. బీజేపీ మరింత బలోపేతం అవుతుందని ఆపార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కీలకస్తానం నుంచి పోటీచేస్తారని.. రాష్ట్రంలో బీజేపీ ముఖ చిత్రాన్ని మార్చేస్తారని చెబుతున్నారు. మరి కుష్బూ బీజేపీకి ఎంత కలిసివస్తుందనేది వేచిచూడాలి.
Delhi: Khushboo Sundar meets BJP national president Jagat Prakash Nadda after joining the party.
She had resigned from Congress earlier today. pic.twitter.com/kqiuGT8Hi6
— ANI (@ANI) October 12, 2020