https://oktelugu.com/

Jagdeep Dhankhar: వెంకయ్యకు షాక్ లగా.. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్ కర్?

Jagdeep Dhankhar: ఎట్టకేలకు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. ఎవరు ఊహించని విధంగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇన్నాళ్లుగా ఊరించిన పేరు మొత్తానికి బహిర్గతం చేసింది. రాజకీయ వ్యూహాలలో భాగంగా పలువురి పేర్లు పరిశీలించినా చివరకు మాత్రం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్ కర్ పేరును సూచించింది. దీంతో జులై 19న నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతోంది. ఎవరైనా పోటీకి వస్తే ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహిస్తారు. ఎవరు పోటీలో లేకుంటే ఏకగ్రీవంగా జగదీప్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : July 17, 2022 / 09:37 AM IST
    Follow us on

    Jagdeep Dhankhar: ఎట్టకేలకు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించింది. ఎవరు ఊహించని విధంగా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఇన్నాళ్లుగా ఊరించిన పేరు మొత్తానికి బహిర్గతం చేసింది. రాజకీయ వ్యూహాలలో భాగంగా పలువురి పేర్లు పరిశీలించినా చివరకు మాత్రం పశ్చిమ బెంగాల్ గవర్నర్ గా ఉన్న జగదీప్ ధన్ కర్ పేరును సూచించింది. దీంతో జులై 19న నామినేషన్ వేసేందుకు సన్నద్ధమవుతోంది. ఎవరైనా పోటీకి వస్తే ఆగస్టు 6న ఎన్నికలు నిర్వహిస్తారు. ఎవరు పోటీలో లేకుంటే ఏకగ్రీవంగా జగదీప్ ధన్ కర్ ఎన్నికయ్యే అవకాశం ఉంది.

    Jagdeep Dhankhar

    రాజస్తాన్ లో ని ఝుంఝును జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జన్మించిన జగదీప్ ధన్ కర్ పాఠశాల విద్యను చిత్తోర్ గడ్ లోని సైనిక్ స్కూలులో పూర్తి చేశారు. ఫిజిక్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి రాజస్తాన్ విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్ బీ చదివారు. హైకోర్టు, సుప్రీంకోర్టులలో న్యాయవాదిగా పనిచేశారు. 1989లో తొలిసారిగా ఝుంఝును నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1990లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా పనిచేశారు. కిషన్ గఢ్ నియోజకవర్గం నుంచి 1993లో రాజస్తాన్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు.

    Also Read: Dalits in AP: ఏపీలో దగాపడ్డ దళితులు.. నోరు మెదపని దళిత మేధావులు

    జులై 2019 నుంచి పశ్చిమబెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న జగదీప్ సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంతో చేరువయ్యారు. తన చేతలతో పేదవారి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టి వారికి ఆరాధ్యుడయ్యారు. దీంతో ఆయన పేరును బీజేపీ అధిష్టానం ప్రకటించేందుకు మొగ్గు చూపిందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఉపరాష్ట్రపతి ఎన్నికకు కావాల్సినంత బలం ఎన్డీఏకు ఉండటంతో మరో అభ్యర్థికి పోటీకి వచ్చే అవకాశాలు లేవు.

    Jagdeep Dhankhar

    జులై 19న నామినేషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 6న ఫలితం ప్రకటిస్తారు. జగదీప్ ధన్ కర్ కు పోటీ లేదనే తెలుస్తోంది. ఎందుకంటే ప్రతిపక్షాలు పోటీలో నిలిచినా వారికి అవకాశం లేదు. అందుకే వారు పోటీకి దూరంగా ఉండనున్నట్లు సమాచారం. ఇక జగదీప్ ధన్ కర్ ఎన్నిక లాంఛనమే అని తెలుస్తోంది. ఎన్నో మలుపులు తిరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నిక వ్యవహారంలో చివరకు ఎన్డీఏ జగదీప్ ధన్ కర్ కు ఓటు వేయడంతో ఇక ఆయన ఎన్నిక పూర్తయినట్లే అని భావిస్తున్నారు.

    మళ్లీ వెంకయ్య నాయుడుకే ఉపరాష్ట్రపతి పదవి ఇస్తారనే ప్రచారం జోరుగా సాగినా చివరిక్షణంలో హ్యాండిచ్చారు. దక్షిణాదికే ఉపరాష్ట్రపతి పదవి అని ఊరించినా చివరకు నిరాశే ఎదురైంది. పార్టీలో ఎన్నో హోదాలు అనుభవించిన వెంకయ్యకే పదవి ఇస్తారనే అనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి అన్న చందంగా వెంకయ్య పరిస్థితి మారింది. మొత్తానికి ఎన్డీఏ జగదీప్ ధన్ కర్ కు ఇచ్చి తన పంతం నెరవేర్చుకుందని తెలుస్తోంది.

    Also Read:Killi Krupa Rani: ఆ కేంద్ర మాజీ మంత్రి చూపు టీడీపీ వైపు.. అసలేం జరిగిందంటే..

    Tags