YS Sharmila: ఇటీవల వైయస్ షర్మిల పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం ఎక్కువైంది. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, పీసీసీ పగ్గాలు తీసుకున్నాక పతాక స్థాయికి చేరుకుంది. ఆమె ఏపీ సీఎం జగన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుండడంతో వైసీపీ సోషల్ మీడియా విభాగం ఈ తరహా చర్యలకు దిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, హైదరాబాద్ కేంద్రంగా చేసుకొని సోషల్ మీడియాలో షర్మిలను టార్గెట్ చేసుకోవడం, షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కావడంతో తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ లోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో షర్మిలపై దుష్ప్రచారం వైసిపి పని కాదని.. తెలుగుదేశం పార్టీ చేయిస్తుందని చెబుతూ ఏపీ పోలీసులు ఒకరిద్దరిపై కేసులు నమోదు చేశారు. అయినా సరే షర్మిలపై కామెంట్స్ ఆగడం లేదు. దీంతో ఆమె నేరుగా కొంతమంది పై పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.
శ్రీ రెడ్డి,వర్ర రవీంద్రారెడ్డి, మేదరమెట్ల కిరణ్ కుమార్, రమేష్ బులుగాకుల, పంచ్ ప్రభాకర్ రెడ్డి, ఆదిత్య, సత్య కుమార్ దాసరి, సేనాని, మహమ్మద్ పాషాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎనిమిది మందికి నోటీసులు జారీ చేస్తారని.. సరైన స్పందన లేకుంటే నేరుగా అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఎక్కువమంది వైసీపీ సోషల్ మీడియాకు పనిచేస్తున్నారు. తప్పుడు రాతలతో ప్రత్యర్థులను మానసికంగా వేధిస్తున్నారు.
ఇందులో శ్రీ రెడ్డి మరి వల్గర్ గా మాట్లాడుతున్నారు. షర్మిలను టార్గెట్ చేస్తూ ఆమె చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయి.ఈమె గత కొంతకాలంగా వైసీపీ సోషల్ మీడియాలో పనిచేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఓసారి అయితే తమకు సక్రమంగా డబ్బులు చెల్లించడం లేదని వైసీపీ సోషల్ మీడియాపై ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఒక వీడియోను బయటకు వదిలారు. వర్ర రవీంద్రారెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. ఆయన వైసీపీ కోసమే పని చేస్తుంటారు. వీరందర్ని అరెస్టు చేస్తే మాత్రం దాని మూలాలు బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి షర్మిల ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. కానీ ఏపీ పోలీసుల గురించి ఆమెకు స్పష్టత ఉంది. పైగా ఉన్నది జగన్ ప్రభుత్వం.అందుకే తమ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణలో అయితే తనకు న్యాయం జరుగుతుందని షర్మిల భావిస్తున్నారు. పోలీసులు గాని యాక్షన్ ప్లాన్ లోకి దిగితే.. వైసిపి అడ్డగోలుగా దొరికిపోవడం ఖాయం. మరి ఏం జరుగుతుందో చూడాలి.