https://oktelugu.com/

Chandrababu: చంద్రబాబుది పెద్ద సాహసమే

తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో కీలకమైనది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇది కొనసాగుతోంది. ప్రస్తుతం 20 మందికి పైగా పోలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో చాలామంది పొలిట్ బ్యూరో సభ్యులకు చోటు దక్కకపోవడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : February 25, 2024 / 11:50 AM IST

    Chandrababu

    Follow us on

    Chandrababu: చంద్రబాబు పెద్ద సాహసం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్లకు ఝలక్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ 94 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో వీలైనంతవరకు జూనియర్లే అధికంగా ఉన్నారు. చాలామంది సీనియర్లకు చోటు దక్కకపోగా.. మరికొందరిని గాలిలో ఉంచడం విశేషం. ఇందులో పార్టీ ఆవిర్భావం నుంచి కొనసాగుతున్న వారు సైతం ఉండడం ఆందోళన కలిగిస్తోంది.

    తెలుగుదేశం పార్టీలో పొలిట్ బ్యూరో కీలకమైనది. పార్టీ ఆవిర్భావం నుంచి ఇది కొనసాగుతోంది. ప్రస్తుతం 20 మందికి పైగా పోలిట్ బ్యూరో సభ్యులు ఉన్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో చాలామంది పొలిట్ బ్యూరో సభ్యులకు చోటు దక్కకపోవడం విశేషం. కళా వెంకట్రావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆనం రామనారాయణరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యరపతినేని శ్రీనివాసరావు, గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత, దేవినేని ఉమ, చింతమనేని ప్రభాకర్, బండారు సత్యనారాయణమూర్తి తదితర సీనియర్ల పేర్లు తొలి జాబితాలో లేవు. కానీ ఆయా జిల్లాల్లో తమకంటే జూనియర్లకు టికెట్లు కేటాయించడంతో వీరంతా ఆగ్రహంతో ఉన్నారు. తమను తక్కువగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీకి సేవలు అందించిన తమను చిన్నచూపు చూస్తున్నారని వాపోతున్నారు.

    అయితే వ్యూహాత్మకంగానే సీనియర్లను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. ఇటీవల పవన్ ఓ ప్రకటన చేశారు. సీనియర్లు రాజకీయాల నుంచి తప్పుకుంటే.. జూనియర్లకు అవకాశాలు దక్కుతాయని పవన్ వ్యాఖ్యానించారు. అయితే అది బుచ్చయ్య చౌదరి కోసం చేసిన ప్రకటన అని అంతా భావించారు. కానీ అది వ్యూహాత్మకంగా చేసిందేనని తాజాగా తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీలో సీనియర్లను పక్కన పెట్టడం ఇదే తొలిసారి. ఎన్నికల్లో చంద్రబాబు తో పాటు తెలుగుదేశం పార్టీకి జీవన్మరణ సమస్యలాంటివి. అందుకే చంద్రబాబు ఎటువంటి భేష జాలాలకు పోలేదు. మొహమాటలకు తావు లేకుండా ముందుకు వెళ్తున్నారు. కేవలం గెలుపు ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తున్నారు. ఎక్కువ సీట్లు తీసుకోవడం గొప్పకాదని.. తీసుకున్న సీట్లలోనే అత్యధిక స్థానాలు గెలుచుకోవడం గొప్ప అని పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. అందుకే సీనియర్లను పక్కన పెట్టారు. అయితే ఎక్కడికి అక్కడే అసంతృప్తులు బయటపడుతున్నా.. రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయని భావిస్తున్నారు. మరోవైపు మలి విడత జాబితాలోనైనా తమకు సీట్లు దక్కుతాయని సీనియర్లు ఆశలు పెట్టుకున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.