https://oktelugu.com/

కేసీఆర్ నే ఢీకొంటున్న షర్మిల.. గజ్వేల్ లో పర్యటన

వైఎస్ వారసురాలిగా షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన ఆమె ఇక గట్టి స్టెప్ తీసుకుంటున్నారు. ఏకంగా కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నికొట్టాలనే నానుడిని నిజం చేస్తూ కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ నే ఎంచుకున్నారు. బుధవారం గజ్వేల్ లో పర్యటించేందుకు జెండా ఊపారు. దీంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ ఇప్పటికే ఆంధ్రలో సీఎంగా ఉండగా ఆమె తెలంగాణలో తన […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 1, 2021 7:59 pm
    Follow us on

    YS Sharmila
    వైఎస్ వారసురాలిగా షర్మిల రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఇన్నాళ్లు ఊరిస్తూ వచ్చిన ఆమె ఇక గట్టి స్టెప్ తీసుకుంటున్నారు. ఏకంగా కేసీఆర్ నే టార్గెట్ చేస్తున్నారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నికొట్టాలనే నానుడిని నిజం చేస్తూ కేసీఆర్ నియోజకవర్గమైన గజ్వేల్ నే ఎంచుకున్నారు. బుధవారం గజ్వేల్ లో పర్యటించేందుకు జెండా ఊపారు. దీంతో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్ జగన్ ఇప్పటికే ఆంధ్రలో సీఎంగా ఉండగా ఆమె తెలంగాణలో తన ప్రభావాన్ని చూపెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    కరోనా సెకండ్ వేవ్ తో కాస్త ఆలస్యమైనా ప్రస్తుతం రాజకీయంగా అడుగులు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. లాక్ డౌన్ అమలులో ఉన్నా నిబంధనల ప్రకారం గజ్వేల్ లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రస్తుతం నిరుద్యోగుల సమస్యల అంశాన్ని ఎంచుకున్న ఆమె జిల్లాల వారీగా దీక్షలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో కరోనా విరుచుకుపడి బ్రేక్ పడింది.

    ఉద్యోగాలు రాక ఆందోళనతో ఆత్మహత్యలు చేసుకున్న వారిని పరామర్శించాలని నిర్ణయించుకున్నారు. ముందుగా సీఎం నియోజకవర్గాన్ని టార్గెట్ చేసుకున్నారు. గజ్వేల్ లో కొంతమంది యువకులు ఆత్మహత్య చేసుకోవడంతో వారిని పరామర్శించాలనే ఉద్దేశంతో బుధవారం గజ్వేల్ పర్యటన ఖరారు చేసుకున్నారు. షర్మిల ఇందిరాపార్క్ వద్ద ఉద్యోగ దీక్ష చేసినప్పుడు విరమింపచేయడానికి గజ్వేల్ యువకుల కుటుంబసభ్యులే వచ్చారు.

    ప్రస్తుతం వారిని పరామర్శించడానికి గజ్వేల్ వెళ్లనున్నారు. గన్ పార్క్ వద్ద నివాళులర్పించి భారీ ర్యాలీగా గజ్వేల్ చేరుకుంటారు. ముఖ్యమంత్రి నియోజకర్గంలో పర్యటన అంటే మీడియా ఫోకస్ ఉంటుందనే విషయంతోనే షర్మిల గజ్వేల్ ను ఎన్నుకున్నట్లు ప్రచారం సాగుతోంది. కేసీఆర్ ను ఢీకొంటేనే ప్రచారం హైప్ పెరుగుతుందని భావించిన షర్మిల గజ్వేల్ ను తమ పర్యటనకు అనువైనదిగా భావించారు. పార్టీని అధికారికంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి రోజు ప్రకటించనున్నారు.