
సోనియా గాంధీ ఏ ఉద్దేశంతో తెలంగాణ ఇచ్చారో అది ఇప్పుడు నెరవేరడం లేదని కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన సాగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. రూ.5 లక్షల కోట్లు అప్పుల్లోకి తెలంగాణ వెళ్లిందని ఆందోళన వ్యక్తం చేశారు. డీపీఆర్ లు లేకుండా ప్రాజెక్ట్ లు కట్టి వేల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం లేదని మండిపడ్డారు. కరోనా బాధితులను పట్టించుకునే నాథుడే లేడని భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం చేశారు.