
ఎన్సీపీ నేత శరద్ పవార్ ఏఐసీసీ నేత రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పేరుతో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడిన ఆయన రాహుల్ గాంధీలో స్థిరత్వం లోపించినట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. దేశాన్ని ముందుకు నడిపించే విషయంలో రాహుల్ ఏ మేరకు సమర్థుడు అన్న ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు. పార్టీలో లుకలుకలు ముగిసి ఆయనకు స్పష్టమైన నాయకత్వం దక్కితే, దీనికి చెక్ పడొచ్చంటూ అభిప్రాయపడ్డారు. నెహ్రూ-, గాంధీ కుటుంబంపై ఉన్న నమ్మకం కూడా ఇందుకు కారణమన్నారు.
Also Read: సైనికుల కోసం మోడీ సాహసం
ఒబామా కామెంట్స్‌పైనా స్పందన
రాహుల్‌పై అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు. ఒబామా ‘ఏ ప్రొమైజడ్ ల్యాండ్’ పుస్తకంలో ‘రాహుల్ గాంధీలో భయం అనే తెలియని గుణం ఉంది.. తరగతి గదిలో టీచర్‌ను ఆకట్టుకోడానికి ప్రయత్నించే విద్యార్ధిలా ఆత్రుతగా ఉంటాడు.. కానీ, ఓ విషయం గురించి లోతుగా నేర్చుకోవాలనే వైఖరి, అభిరుచి లేదు’ అంటూ రాసుకున్నారు. దీనిపై స్పందించిన పవార్ ఒబామా వ్యాఖ్యలను రాహుల్ అంగీకరించాల్సిన అవసరం లేదన్నారు.
Also Read: ఆ తప్పిదం చేయకుండా మమత అలర్ట్ అయ్యారట
చర్చనీయాంశంమైన పవార్ కామెంట్స్
శరద్ పవార్ కూటమిలో కాంగ్రెస్ భాగస్వామ్యంగా ఉన్న తెలిసిందే. రాహుల్ గాంధీతో గతంలో విడిపోయి సక్సెస్ అయిన శరద్ పవార్ తాజా కామెంట్లు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌తోనే ఉన్నా… ఆ పార్టీ నాయకత్వంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో బీజేపీని దెబ్బకొట్టడంలో పవార్ ఆడిన పవర్ గేమ్ ఏంటో దేశం మొత్తం చేశారు. ఆయన రాజకీయ చాణిక్యత ముందు ప్రధాని మోడీ, హోం మినిస్టర్ అమిత్‌షా పాచికలు పారలేదు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్