Shahid Afridi: చేసిన పనిలో అపజయం ఎదురైతే.. పది మందికి చెప్పుకుంటామా? ఓడిపోయినప్పటికీ వేడుకలు చేసుకుంటామా? ఈ భూమి మీద మనిషి అన్నవాడు ఎవడు కూడా అలాంటివి చేసుకోడు. కానీ దిక్కుమాలిన పాకిస్తాన్ మాత్రం వేడుకలు చేసుకుంటున్నది. విక్టరీ ర్యాలీలు చేస్తోంది. ప్రపంచాన్ని జయించినట్టు.. భారత్ మీద విజయం సాధించినట్టు బిల్డప్ కొడుతోంది. ఓవైపు కరాచీ నౌకాశ్రయం నుంచి మంటలు ఇంకా తగ్గలేదు. నూర్ కాన్ ఎయిర్ బేస్ పనికొస్తుందో లేదో తెలియదు. కిరానా హిల్స్ న్యూక్లియర్ ప్లాంట్ నుంచి లీకులు మొదలయ్యాయి.. ఇవన్నీ కళ్ళముందు కనిపిస్తున్నవే కదా.. దానికంటే ముందు 9 ఉగ్రవాద స్థావరాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి.. ఇవన్నీ ఎక్కడో దూరంగా ఉన్న అంగారక గ్రహంలో జరగలేదు కదా.. ఇవన్నీ కూడా దిక్కుమాలిన ఉగ్రవాద దేశంలోనే కదా చోటు చేసుకున్నవి.. ఇవన్నీ జరిగినప్పటికీ కూడా.. ఇంత నష్టం వాటిల్లినప్పటికీ కూడా.. సిగ్గు శరం లేకుండా.. నీతి రీతి లేకుండా ఉగ్రవాద దేశం విక్టరీ ర్యాలీలో నిర్వహించడమే అబ్సర్డ్. పైగా ఆ ర్యాలీలో పనికిమాలిన పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది పాల్గొనడం.. పైగా ఆ వీడియోలను పాకిస్తాన్ దేశానికి చెందినవారు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం.. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుదా.. ఇంతకంటే నీతిమాలిన పని ఇంకొకటి ఉంటుదా?
Also Read: ఒక్క నిమిషంలో ఆరు అబద్ధాలు చెప్పిన పాక్.. వీడియో వైరల్
అఫ్రిది సిగ్గు లేదా
పాకిస్తాన్ ప్రధాని అబద్ధాలు చెబుతున్నాడు అంటే క్షమించేయొచ్చు. ఎందుకంటే అతడు ఉన్న పరిస్థితిలో అంతకుమించి ఏమీ చెప్పలేడు. ఏమీ చేయలేడు కూడా. కానీ షాహిద్ ఆఫ్రిదికి ఏమైంది.. భారత్ ముందు తలవంచిన పాకిస్తాన్ ను చూసి ఏడవాల్సింది పోయి.. విక్టరీ ర్యాలీ నిర్వహించడం ఏంటి.. నిజంగా ఎందుకు విక్టరీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.. ఉగ్రవాదులు చనిపోతే వారి అంతిమయాత్రలో ఎందుకు పాల్గొంటున్నారు.. అంటే తమది ఉగ్రవాద దేశం అని అఫ్రిది ఒప్పుకుంటున్నాడా.. అందువల్లే అతడు విక్టరీ ర్యాలీలో పాల్గొంటున్నాడా.. ఇంతటి తెగువ.. ఇంతటి చొరవ ఉన్న ఆఫ్రిది ఇమ్రాన్ ఖాన్ విషయంలో ఎందుకు మాట్లాడటం లేదు.. ఇమ్రాన్ ఖాన్ కు జైల్లో ఉండగా ఏదో ఆపద సంభవించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నది. మరి ఇలాంటప్పుడు ఆఫ్రిది వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు? కనీసం ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదు? ఉగ్రవాదులకు వత్తాసు పలికినంత మాత్రాన అఫ్రిది పాకిస్తాన్లో హీరో అవ్వచ్చు గాని.. ప్రపంచంలో కాదు. ఒక క్రికెటర్ గా నిన్నటిదాకా ఆఫ్రిదీ గొప్పగా కనిపించేవాడు. కానీ ఇప్పుడు వేస్ట్ మెటీరియల్ అనే తనకు తానే నిరూపించుకుంటున్నాడు.. ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేస్తే ఆఫ్రిది ఎందుకు స్పందిస్తున్నాడు? అంటే తమది ఉగ్రవాద దేశం అని అఫ్రిది ఒప్పుకుంటునట్టే కదా.. మరి ఇంతోటి దానికి విక్టరీ ర్యాలీలు ఎందుకు.. ఇంత హంగామా ఎందుకు.. ఉగ్రవాదులతోనే ర్యాలీలు.. సంబరాలు నిర్వహిస్తే సరిపోతుంది కదా..