Pakistan: మన పక్కనే ఉన్న ఉగ్రవాద దేశం గురించి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా.. దాని దుర్మార్గాలు అంతకుమించి అనే విధంగానే ఉంటాయి. ఎందుకంటే ఆ దేశం పుట్టుకలోనే అబద్ధం ఉంది. దాని నడవడికలోనే అవినీతి ఉంది. దాని మనుగడ లోనే అధర్మం ఉంది. అది సాగించే తీరులోనే అన్యాయం ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టే ఆదేశం దరిద్రంలో కొట్టుమిట్టాడుతోంది. పేదరికంలో మనుగడ సాగిస్తోంది. ఎవరైనా బిచ్చం వెయ్యకపోతారా అని ఆశగా ఎదురుచూస్తోంది. చివరికి చిల్లర పైసల కోసం తెగ తాపత్రయపడుతోంది. దేశ సార్వభౌమాధికారాన్ని .. దేశ సైనిక బలాన్ని ఉగ్రవాదుల ముందు తాకట్టుపెడుతోంది. ఉగ్రవాదులు చెప్పినట్టే తోలుబొమ్మలాగా ఆడుతోంది. కనీసం ఒక దేశం అనే అంకితం ఆ టెర్రరిస్ట్ కంట్రీకి లేకపోవడం అత్యంత దారుణం.
Also Read: పాక్ మిస్సైల్స్ ను దీపావళి బాంబులు చేశారు కదరా.. దాయాది దేశం ఇజ్జత్ పోయింది..: వైరల్ వీడియో
ఒక్క నిమిషంలో ఎన్ని అబద్ధాలో..
భారత సైనిక శక్తితో పూర్తి చూసుకుంటే ఉగ్రవాద దేశ సైనిక శక్తి దాదాపు 0.5 శాతం కూడా ఉండదు. ఒక రకంగా భారతదేశంతో కనుక తలపడితే పాకిస్తాన్ పట్టుమని నాలుగు రోజులు కూడా నిలబడలేదు. ఆ విషయం ఆ దేశ పరిపాలకులకు కూడా తెలుసు. కానీ ప్రజలను మభ్యపెట్టడానికి.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి రకరకాల ప్రకటనలు చేస్తుంటారు. తాజాగా పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి షరీఫ్ చేసిన ప్రకటనలు కూడా అలానే ఉన్నాయి. అబద్దాలకు ప్యాంటు, షర్టు వేసి ఆయన ప్రజలను మోసం చేయాలి అనుకున్నాడు.. ఆయన చేసిన ప్రకటనలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ” భారతదేశానికి సంబంధించిన డ్రోన్లు మా సరిహద్దులోకి రాకముందే రాడార్లు గుర్తించాయి. మాది అత్యంత ప్రొఫెషనల్ ఆర్మీ. భారత డ్రోన్లను నేల కూల్చింది. పాకిస్తాన్లో నష్టం జరగకుండా చూసింది. మా ఆర్మీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని” గొప్పలు చెప్పాడు. కానీ చెప్పినంత సమయం పట్టలేదు అవన్నీ పచ్చి అబద్ధాలు అని నిరూపించడానికి.. ఎప్పుడైతే షరీఫ్ ఆ వ్యాఖ్యలు చేశారో.. అప్పుడే నెటిజన్లు తెగ శోధించడం మొదలుపెట్టారు. దీంతో అతడు చెప్పినవన్నీ అబద్ధాలు అని తేలిపోయింది. అంతేకాదు పాకిస్తాన్ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి అతడు అవాస్తవాలు చెబుతున్నాడని అర్థం అయిపోయింది.. వాస్తవానికి మన దేశానికి సంబంధించిన డ్రోన్లు పాకిస్తాన్ వెళ్ళకుండా మధ్యలోనే పేలిపోతే.. అంత నష్టం ఎందుకు వాటిల్లింది.. అంతలా భవనాలు ఎందుకు కూలిపోయాయి.. అతలా ఉగ్రవాదులు ఎందుకు చనిపోయారు.. పాపం ఇవే ప్రశ్నలు నెటిజన్లు సంధిస్తే పాకిస్థాన్ ఆర్మీ దగ్గర సమాధానం లేదు. పాకిస్తాన్ నెటిజన్ల వద్ద కూడా బదులు లేదు. నిన్నటిదాకా అరాచకం.. అన్యాయం.. అక్రమం ఆధారంగానే పాకిస్తాన్ బతుకుతుంది అనుకుంటే.. ఇప్పుడు ఆ జాబితాలోకి అబద్ధాలు కూడా చేరిపోయాయి.. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో సోషల్ మీడియాలో విమర్శలు వరదలాగా వ్యక్తం అవుతున్నాయి. ” ఒరేయ్ మీరు యుద్ధం చేయలేరు. కనీసం మీ వద్ద యుద్ధ సామాగ్రి కూడా లేదు. పొరుగు దేశాలు యుద్ధ సామగ్రి ఇస్తేనే బతుకుతారు. అలాంటి మీకెందుకురా యుద్ధాలు.. ముందు గోధుమపిండి కొనుక్కొని.. ఏదో ఒకటి చేసుకొని తిని సావండి” అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.