జగన్ సర్కారుకు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసును విచారించిన సుప్రీం కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. 4 వారాలలో రంగులను తొలగించాలని, లేని పక్షంలో కోర్టు దిక్కరణ కేసు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ కేసులో హైకోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చిందని, అందులో ఎటువంటి లోపాలు లేవని తెలిపింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు ఒకటి కాదని ప్రభుత్వ న్యాయవాదులు వాదించినా సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 4 వారాలు లోగా గ్రామ పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను తొలగించాలని స్పష్టం చేసింది.
గతంలో హైకోర్టులో పంచాయతీ కార్యాలయాలకు ప్రభుత్వం వేసిన రంగులు తొలగించాలని అదేశించినా ప్రభుత్వం తొలగించకుండా ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేసి ఆ కమీటీలో వైసీపీ రంగులు, మట్టి రంగు కలిపి పంచాయతీ కార్యాలయాలకు వేసేందుకు జి.ఓ 623ను విడుదల చేసింది. అనంతరం ఈ జి.ఓపై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు ధిక్కారంగా ఈ నెల 28వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. లేనిపక్షంలో కోర్టు ధిక్కారణగా పరిగణిస్తామని పేర్కొంది. దీంతో పంచాయతీలకు పార్టీ రంగులు కొనసాగించాలనే అంశంలో ఉన్న చివరి ఆశ జగన్ ప్రభుత్వానికి గల్లంతైంది.
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
Read MoreWeb Title: Setback to jagan supreme court on party colours
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com