
జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే గవర్నర్ తమిళ సై పుట్టిన రోజు కావడంతో ఆమెకు ట్వీటర్లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెల్సిందే. మంగళవారం సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ దంపతులను చిరు దంపతులు ప్రత్యేకంగా కలిసి మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. నిన్న ఉదయం సోషల్ మీడియాలో విషెస్ చెప్పిన చిరంజీవి సాయంత్రం గవర్నర్ తో బేటీకావడంతో అటూ రాజకీయ, ఇటూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చాక చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. అభిమానులతో ముచ్చటించడంతోపాటు సినీ, రాజకీయ ప్రముఖుల బర్తేడ్ లకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈక్రమంలో తమిళ సై కు జన్మదిన ట్వీటర్లో జన్మదిన శుభాకాంక్షలు తెలిపగా ఆమె స్పందిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోజు సాయంత్రమే సాయంత్రం చిరు దంపతులు గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా చిరంజీవి రోటిన్ భిన్నంగా కన్పించడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి పంచె.. షర్టుతో సగటు తమిళుడి మాదిరి గవర్నర్ వద్దకు వెళ్లారు. సాధారణంగా తమిళులు తమ సొంత రాష్ట్రం, మాతృభాషపై ఎక్కువ అభిమానాన్ని చూపిస్తుంటారు. చిరుకు ఈ విషయం తెలుసు కాబట్టే వూహాత్మకంగా అలా వెళ్లారనే టాక్ విన్పిస్తుంది. ఇటీవల కాలంలో చిరు టాలీవుడ్లోని సమస్యల పరిష్కారం కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో బేటీ అయి చర్చించారు. షూటింగులు ప్రారంభమయ్యేలా ఇండస్ట్రీని పలువురితో కలిసి కేసీఆర్ తో చర్చించిన సంగతి తెల్సిందే. కేసీఆర్ డైరెక్షన్ మేరకు చిరంజీవి నాయకత్వంలో షూటింగులను ప్రారంభించేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రి మెగాస్టార్ బేటీ కాబోతున్నారు.
చిరంజీవి అటూ రాజకీయ నాయకులతో, ఇండస్ట్రీలోని పెద్దలతో సన్నిహితంగా ఉంటూ ఇండస్ట్రీగా పెద్దదిక్కుగా మారుతున్నారు. కాగా చిరంజీవి గవర్నర్ తమిళ సై ను మర్యాదపూర్వకంగా కలిశారా? లేదా రాజకీయంగా ఏమైనా చర్చించారా? అనేది చర్చనీయాంశంగా మారింది.