Former Tamil Nadu CM Jayalalitha: దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమలో మహానటిగా ఒక వెలుగు వెలిగి, ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టి తమిళనాడు లో 6 సార్లు ముఖ్యమంత్రి గా పనిచేసిన జయలలిత గారు 2016 వ సంవత్సరం డిసెంబర్ 6 వ తేదీన మరణించిన ఘటన యావత్తు భారతదేశ ప్రజలను ఎంతలా బాధపెట్టిందో మన అందరికి తెలిసిందే..తమిళనాడు లో అందరూ ఆమెని ప్రేమతో అమ్మా అని పిలుచుకుంటారు..అయితే జయలలిత గారి మృతి పట్ల ఎన్నో అనుమానాలు ఉన్నాయి..పక్కనే ఉంటూ జయలలిత గారి పతనం కి గోతులు తీసింది అని శశికళపై అనేకమైన ఆరోపణలు ఉన్నాయి.

దీనిపై కోర్టులో కేసు కూడా నడుస్తూ ఉంది..ప్రస్తుతం తమిళనాడు లో నడుస్తున్న DMK ప్రభుత్వం జయలలిత గారి మరణం పై అనేకమైన అనుమానాలు ఉన్నాయని..దీని పై పటిష్టమైన విచారణ జరిపించాలంటూ DMK ప్రభుత్వం ఆర్ముగం అద్వర్యం లో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసారు..ఆ కమిటీ నుండి వచ్చిన నివేదిక ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ని ఒక ఊపు ఊపేస్తోంది..జయలలిత గారు మరణం సహజం గా లేదని..ఆమె చనిపోయిన సమయం కూడా మార్చేశారని ఈ నివేదిక లో వెల్లడించారు.
ఇలా ఆమె చనిపోయన సమయం లో చోటు చేసుకున్న విషయాలు ఒక్కటి కూడా సరిగా లేవని..ఇది సాధారణ మరణం అయితే కాదని ఆ నివేదిక పేర్కొంది..దీనిపై మరిన్ని వివరాలు సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు..ఈ ఇంటర్వ్యూ లో ఆయన చెప్పిన కొన్ని విషయాలు వింటే పాపం సింహం లాగ బ్రతికిన జయలలిత గారు చివరి రోజుల్లో ఇంత దారుణమైన పరిస్థితులను ఎదురుకున్నారా అని మనకి కన్నీళ్లు రాక తప్పదు..జయలలిత గారికి మొదటి నుండి కుడిభుజం లాగ ఉంటూ వచ్చిన శశికల జయలలిత గారు బ్రతికి ఉండకూడదు అనే దురుద్దేశం తో పెద్దగా అనారోగ్యం లేకపోయినా కూడా ఆసుపత్రి లో చేర్పించి ఆమెని చనిపోయేలా చేసేందుకు ఎన్నో కుట్రలు చేసిందని చెప్పుకొచ్చారు రామారావు గారు..హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాక జయలలిత గారికి షుగర్ ఉంది అంటూ ఆమె రెండు కాళ్ళని కట్ చేసి నడవలేని స్థితికి తీసుకొచ్చారు.

అంతే కాకుండా తమిళనాడు కోట్లాది మందికి ఉచితంగా అన్నం పెట్టి , ఎంతోమంది పేదల ఆకలి తీర్చిన జయలలిత గారు పట్టెడు అన్నం కోసం చివరి రోజుల్లో ఎంతలా అలమటించేవారో ఇమంది రామారావు గారు ఆ ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలు వింటే ఏడుపు రాక తప్పదు..సమయానికి అన్నం పెట్టకుండా జయలలిత గారిని వేధించేవారట..ఇదంతా ఆమె పక్కనే ఉంటూ శశికళ చేసిన పనులను..వీటికి పూర్తి ఆధారాలు త్వరలోనే బయటపడనున్నాయి అంటూ ఇమంది రామారావు గారు పేర్కొన్నారు.