Naga Chaitanya – Samantha: సౌత్ ఇండియా లో దశాబ్దం నుండి అగ్ర కథానాయికగా విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ ముందుకు దూసుకుపోతున్న స్టార్ హీరోయిన్స్ లో ఒకరు సమంత..అలాంటి సమంత ఇప్పుడు అభిమానులతో పాటుగా..ఇండస్ట్రీ లో ఉన్న సెలబ్రిటీస్ ని కూడా భయాందోళనకు గురి చేస్తూ కంటతడి పెట్టించేలా చేసింది..అసలు విషయానికి వస్తే సమంత గత కొంతకాలం నుండి మాయోసిటిస్ అనే వ్యాధితో తీవ్రంగా బాధపడుతున్నట్టు సోషల్ మీడియా లో ఆమె పెట్టిన ఒక పోస్టు ప్రకంపనలు రేపింది.

‘నా జీవితం లో మంచి , చెడు అన్ని ఫాస్ట్ గా జరిగిపోయాయి..అలా నాకు వచ్చిన ఈ మాయోసిటిస్ వ్యాధి కూడా తొందరగా తగ్గిపోతుంది, తగ్గినప్పుడు అభిమానులందరికి తెలియచేద్దాం అనుకున్నాను..కానీ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు..చికిత్స తీసుకుంటున్నాను..త్వరలోనే తగ్గిపోతుంది అనుకుంటున్నాను’ అని ఆమె వేసిన ఒక ట్వీట్ అభిమానులను మరియు సెలెబ్రిటీలను కంగారు పడేలా చేసింది.
‘నువ్వు చాలా స్ట్రాంగ్ లేడీవి ..జీవితం లో ఎన్నో ఆటుపోట్లను ఎదురుకొని నిలబడ్డావు..ఈ వ్యాధిని కూడా విజయవంతంగా ఎదురుకుంటావు..ధైర్యంగా ఉండు’ అంటూ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ,నాగబాబు మరియు సమంత తోటి నటీనటులు ట్విట్టర్ లో ఆమెకి రిప్లై ఇస్తూ ధైర్యం చెప్పారు.
అక్కినేని కుటుంబం నుండి కూడా అఖిల్ మరియు సుశాంత్ వంటివారు సమంత కి ఇంస్టాగ్రామ్ లో రిప్లై ఇస్తూ ధైర్యం చెప్పారు..కానీ సమంత మాజీ మామయ్య అక్కినేని నాగార్జున..మాజీ భర్త అక్కినేని నాగ చైతన్య మాత్రం ఇప్పటి వరుకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు..విడిపోయిన కూడా సమంత నాకు ఎప్పటికి కోడలు లాంటిదే అని నాగార్జున గారు అప్పట్లో చెప్పిన మాటలను అందరూ మెచ్చుకున్నారు.
అలాగే సమంత తో విడిపోయినప్పటికీ కూడా ఒక స్నేహితుడిగా ఆమె తోడు జీవితాంతం ఉంటానని నాగ చైతన్య కూడా చెప్పాడు..అలాంటి వీళ్లిద్దరు ఆమె ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతుంటే కనీసం రెస్పాన్స్ కూడా ఇవ్వకపోవడం ఏమిటి అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి విమర్శలు రావడం ప్రారంభం అయ్యాయి.

అయితే లేటెస్ట్ గా అందుతున్న సమాచారం ఏమిటి అంటే నాగచైతన్య, నాగార్జున – అమల లు విడివిడిగా సమంత చికిత్స తీసుకుంటున్న హాస్పిటల్ కి వెళ్లి ఆమెని కలిసి ధైర్యం చెప్పారని ఫిలిం నగర్ లో వినిపిస్తున్న టాక్..
ఇక సమంత పరిస్థితిని తెలుసుకొని బాధపడి నాగ చైతన్య కూడా కరిగిపోయాడని.. తన వల్లే ఈ సమంతకు ఈ దుస్థితి వచ్చిందా? డిప్రెషన్ లో.. అధిక ఎక్సర్ సైజులు వల్ల సమంత ఇలా జబ్బు బారిన పడిందా? అని బాధపడ్డాడట.. విడాకులు తీసుకున్నాక సమంత డిప్రెషన్ పాలై ఇలా అయ్యిందని తెలుసుకొని ఆమెకు తోడుగా ఉండాలని డిసైడ్ అయ్యాట.. ఈ మేరకు వీరిద్దరూ మళ్లీ ఒక్కటవ్వాలని డిసైడ్ అయ్యారని.. ఈ మేరకు త్వరలోనే ప్రకటన రావచ్చన్న ప్రచారం సోషల్ మీడియాలో సాగుతోంది. అయితే దీనిపై అటు సమంత కానీ.. ఇటు నాగచైతన్య కానీ ఎటువంటి స్పందన తెలియజేయలేదు.