America and China: వారిద్దరు అగ్రదేశాధినేతలు. ఒకరు కమ్యూనిస్టు దేశాధినేత కాగా మరొకరు ప్రజాస్వామ్య దేశాధినేత. ఇద్దరి మధ్య ఇన్నాళ్లు బేధాభిప్రాయాలు వచ్చినా వాటిని పక్కన పెట్టాలని చూస్తున్నారు. ప్రపంచ క్షేమం దృష్ట్యా కొన్ని పనులు చేయాల్సి ఉందని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇద్దరు వర్చువల్ సమావేశంలో పాల్గొని చేయాల్సిన పనులపై చర్చించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ లు భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేకంగా సంభాషించుకున్నారు. ఇద్దరు దేశాధినేతలు ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో వాణిజ్యం, రక్షణ రంగం, దౌత్య సంబంధాలపై వారి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.
గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాపై దూకుడుగా వ్యవహరించి పలుమార్లు హెచ్చరికలు సైతం చేశారు. దీంతో వీరి మధ్య చర్చలపై అందరిలో ఆసక్తి ఏర్పడింది. రెండు దేశాల మధ్య చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో ఇద్దరు దేశాధినేతల సమావేశం సంబంధాలను బలోపేతం చేస్తుందని తెలుస్తోంది.
మానవాళి ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకునే క్రమంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవడంపై దృష్టి సారించినట్లు సమాచారం. కరోనా వ్యాప్తి, వాతావరణ మార్పుల నేపథ్యంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించేందుకు నిర్ణయించారు. వాటిని అమలు చేసేందుకు ఇద్దరు మధ్య సానుకూల సంకేతాలు వచ్చినట్లు సమాచారం.
Also Read: ఫేస్ బుక్ తో బంధాలు, సంసారాలు కూలిపోతున్నాయా..? అసలు నిజాలేంటి?
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ లిస్ట్ ఇదే.. కొందరికీ లక్కీ ఛాన్స్.. వీళ్లకు షాక్