https://oktelugu.com/

God Father Movie: మెగాస్టార్ కి చెల్లెలిగా నటించనున్న సీనియర్ నటి… ఎవరంటే ?

God Father Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. ఇప్పటికే ఆచార్య, గాడ్​ఫాదర్​,  సినిమాల్లో నటిస్తూ.. షూటింగ్స్​లో నిమగ్నమయ్యారు చిరు. ఒక సినిమాను పూర్తి చేసిన వెంటనే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతున్నారు చిరు. ‘ఆచార్య’ సినిమాను ఇటీవలే  పూర్తి చేశారు చిరు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా… ఇటీవలే  షూటింగ్ లో పాల్గొంటున్నారు మెగాస్టార్. మలయాళ చిత్రం ‘లూసిఫర్’ కి రీమేక్ […]

Written By: , Updated On : November 16, 2021 / 04:56 PM IST
Follow us on

God Father Movie: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారనే చెప్పాలి. ఇప్పటికే ఆచార్య, గాడ్​ఫాదర్​,  సినిమాల్లో నటిస్తూ.. షూటింగ్స్​లో నిమగ్నమయ్యారు చిరు. ఒక సినిమాను పూర్తి చేసిన వెంటనే మరో సినిమా సెట్స్ పైకి వెళ్లిపోతున్నారు చిరు. ‘ఆచార్య’ సినిమాను ఇటీవలే  పూర్తి చేశారు చిరు. ఈ సినిమాకు మోహన్ రాజా దర్శకత్వం వహిస్తుండగా… ఇటీవలే  షూటింగ్ లో పాల్గొంటున్నారు మెగాస్టార్. మలయాళ చిత్రం ‘లూసిఫర్’ కి రీమేక్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది.

god father movie makers planning to rope ramya krishna for chiru sister role

ఒరిజనల్ వెర్షన్ లో మోహన్ లాల్ చెల్లెలిగా మంజు వారియర్ నటించి మెప్పించారు. ఇక తెలుగులో చిరు చెల్లెలిగా నయనతార నటిస్తుందని వార్తలు వినిపించాయి.  ఆ తరువాత నయన్ ప్లేస్ ని శోభన రీప్లేస్ చేసిందని కూడా అన్నారు. అయితే తాజాగా వీరిద్దరూ కాకుండా సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఆ పాత్రలో మెరవబోతుందని సమాచారం. 90 లో రొమాంటిక్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్నారు చిరు – రమ్యకృష్ణ జంట.  ఇప్పటికి కూడా వారిద్దరూ పార్టీల్లో, వేడుకలో కలిసినప్పుడు వారి బాండింగ్ కూడా అలానే ఉంటుంది.

ఇప్పుడు ఈ చిత్రంలో చిరు చెల్లెలిగా చేయడానికి రమ్యకృష్ణ ఒప్పుకున్నది ఇంకా తెలియలేదు. మరి ఈ వార్తల్లో నిజమెంతో  తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడక తప్పదు.  ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఈ మూవీ లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్  కూడా ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు అని సమాచారం.