Samantha: టాలీవుడ్ అగ్ర కథానాయికల్లో సమంత ఒకరు. వరస సినిమాలతో, కొత్త ప్రాజెక్టులతో తనదైన శైలిలో దూసుకుపోతోంది ఈ అమ్మడు. నిన్న మొన్నటి వరకు బాలీవుడ్ అంటూ ఇప్పుడు ఏకంగా హాలీవుడ్ లో నటించబోతున్నట్లు సమాచారం జోరుగా నడుస్తుంది. ఇదిలా ఉంటే తనదైన శైలిలో సోషల్ మీడియాలో సెటైరికల్ గా ‘అమ్మ చెప్పింది’ అంటూ ఎవర్ని ఉద్దేశించి అంటుందో వారికి అర్థమయ్యేలా చెబుతోంది ఈ భామ.
నాగచైతన్యతో విడాకుల ప్రకటన అనంతరం సోషల్ మీడియాలో “అమ్మ చెప్పింది” అంటూ సెటైరికల్ గా పోస్టు పడుతోంది ఈ అమ్మడు. అయితే తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో సామ్ చేసిన వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘మన ముందు బల ప్రదర్శన చూపించేవాళ్లు మెంటల్‌గా ఎప్పటికీ స్ట్రాంగ్ కాలేరు. తెలియని యుద్ధాలను అధిగమించేవారే నిజమైన బలవంతులు’ అని పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు ఎవరిని ఉద్దేశించి చేశారన్నది సామ్ కు తెలుసు. నెటిజన్లు మాత్రం ఎవరి ఊహాగానాలకు తగ్గట్లు వారు ఊహించుకుంటున్నారు. అయితే ఇదిలా ఉంటే సమంత వేసే ప్రతి సెటైర్‌కు సోషల్ మీడియా నుంచి మంచి మద్దతు లభిస్తోంది.
ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో లేడి ఓరియెంటెడ్ గా తెరకెక్కిన శాకుంతలం అనే చిత్రాన్ని పూర్తిచేసి తమిళ స్టార్ విజయ్ సేతుపతి సినిమాలో నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో” పుష్ప” సినిమాలోనూ అల్లు అర్జున్ తో ఐటమ్ సాంగ్ చేయనుంది.