https://oktelugu.com/

మారిటోరియంలో వడ్డీపై వడ్డీ మినహాయింపు.. రుణగ్రహీతలకు ఊరట..!

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడం కేంద్రం లాక్డౌన్ విధించింది. కొన్నినెలలపాటు లాక్డౌన్ కొనసాగడంతో అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. అయితే ఇటీవల కేంద్రం ఆన్ లాక్ పేరిట కొన్ని మినహాయింపులు ఇస్తుండటంతో మళ్లీ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోంది.కరోనా కాలంలో దెబ్బతిన్న అన్నిరంగాలకు ఆదుకునేందుకు కేంద్రం కొన్ని చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే కేంద్రం ఆదేశాలతో ఆర్బీఐ మారటోరియం వసతి కల్పించింది. అయితే ఆర్బీఐ రుణాలపై వడ్డీ వసూలు చేయడం.. ఆ వడ్డీపై […]

Written By:
  • NARESH
  • , Updated On : October 3, 2020 8:17 pm
    Follow us on

    దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడం కేంద్రం లాక్డౌన్ విధించింది. కొన్నినెలలపాటు లాక్డౌన్ కొనసాగడంతో అన్నిరంగాలు దెబ్బతిన్నాయి. దీంతో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది. అయితే ఇటీవల కేంద్రం ఆన్ లాక్ పేరిట కొన్ని మినహాయింపులు ఇస్తుండటంతో మళ్లీ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతోంది.కరోనా కాలంలో దెబ్బతిన్న అన్నిరంగాలకు ఆదుకునేందుకు కేంద్రం కొన్ని చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగానే కేంద్రం ఆదేశాలతో ఆర్బీఐ మారటోరియం వసతి కల్పించింది. అయితే ఆర్బీఐ రుణాలపై వడ్డీ వసూలు చేయడం.. ఆ వడ్డీపై మళ్లీ వడ్డీ విధించడం వల్ల ఏం ప్రయోజనం లేదని పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో మారటోరియం వల్ల రుణాలు చెల్లించే కాలపరిమితి మాత్రమే పెరుగుతుందని వడ్డీ చెల్లించాల్సిందేనంటూ ఆర్బీఐ గతంలో ప్రకటించింది.

    Also Read: ఉద్యోగులకు మేలు చేసేలా కేంద్రం కొత్త నిబంధనలు..?

    ఈనేపథ్యంలోనే ఆర్బీఐ నిర్ణయంపై కేంద్రం వైఖరి ఏంటో చెప్పాలని సుప్రీం కోర్టు కోరింది. ఈమేరకు కేంద్రం స్పందిస్తూ రెండు కోట్ల వరకు రుణాలు తీసుకున్న వారికి వడ్డీపై వడ్డీ వదులుకునేందుకు సిద్ధమేనని కోర్టుకు తెలిపింది. మారటోరియం వ్యవధి అయిన మార్చి నుంచి ఆగస్టు వరకు ఈ మాఫీ వర్తిస్తుందని పేర్కొంది. దీని వల్ల కేంద్రంపై అదనంగా 6లక్షల కోట్ల భారం పడుతోందని స్పష్టం చేసింది.

    Also Read: కేసు పెట్టాల్సిన పోలీసులే కాట్నం పేర్చి కాల్చారు

    అయితే గతంలో ఆర్బీఐ బ్యాంకు రుణాలపై మారటోరియం కాలంలో విధించే వడ్డీ మాఫీ చేయడం కుదరని ప్రభుత్వానికి.. సుప్రీంకోర్టుకు చెప్పింది. కాగా మాజీ కాగ్ రాజీవ్ మెహ్రీషి నేతృత్వంలో ఏర్పాటు కమిటీ ప్రభుత్వానికి పలు సిఫార్సు చేసింది. ఈనేపథ్యంలోనే మారిటోరియంలో ఆర్బీఐ వడ్డీపై వడ్డీ వసూలు చేయడంపై కేంద్రం తన వైఖరి మార్చుకుంది. ఆర్బీఐ విధించే వడ్డీని ప్రభుత్వమే  చెల్లించనున్నట్లు కోర్టుకు తన అభిప్రాయాన్ని తాజాగా వెల్లడించింది. దీనిపై సోమవారం మరోసారి సుప్రీంలో విచారణ జరుగనుంది.