మరో సీనియర్ జర్నలిస్టును బలిగొన్న కరోనా

  తెలంగాణలో కరోనా వైరస్ మరో జర్నలిస్టును బలితీసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ “మా హైదరాబాద్” వెబ్ ఛానల్ సీఇఓ, సంపాదకుడు శ్రీధర్ ధర్మాసనం కోవిడ్ తో గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు ఝామున మరణించారు. పదిరోజుల క్రితం ఆయన కరోనా వ్యాధితో ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు. శ్రీధర్ ధర్మాసనం కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. 1965 ఏప్రిల్ 23న శ్రీధర్ జన్మించారు. చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్ […]

Written By: NARESH, Updated On : April 28, 2021 3:03 pm
Follow us on

 

తెలంగాణలో కరోనా వైరస్ మరో జర్నలిస్టును బలితీసుకుంది. సీనియర్ జర్నలిస్ట్ “మా హైదరాబాద్” వెబ్ ఛానల్ సీఇఓ, సంపాదకుడు శ్రీధర్ ధర్మాసనం కోవిడ్ తో గచ్చిబౌలి టిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తెల్లవారు ఝామున మరణించారు. పదిరోజుల క్రితం ఆయన కరోనా వ్యాధితో ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో బుధవారం తుదిశ్వాస విడిచారు.

శ్రీధర్ ధర్మాసనం కరీంనగర్ జిల్లాకు చెందిన వారు. 1965 ఏప్రిల్ 23న శ్రీధర్ జన్మించారు. చాలా ఏళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. విద్యాభ్యాసం హైదరాబాద్ లోనే జరిగింది. జగ్జీవన్ రామ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జర్నలిజం పూర్తి చేశారు. న్యూస్ టైం, డెక్కన్ క్రానికల్ లో పనిచేస్తూ టెలిమీడియా ఆన్ టీవీ మీడియా సంస్థను 1992లో స్థాపించాడు.

తెలంగాణ ఉద్యమంలో కూడా శ్రీధర్ చురుకుగా పాల్గొన్నారు. ఆన్ లైన్ జర్నలిస్టులకు ఓ యూనియన్ కూడా ఏర్పాటు చేశాడు. ప్రభుత్వ, కార్పొరేట్ రంగాలకు చెందిన పలు చిత్రాలను రూపొందించారు. పాత్రికేయునిగా, నిర్మాత దర్శకునిగా ఆయన అందించిన సేవలకు గుర్తింపుగా “ ఇండి వుడ్” జీవన సాఫల్య సత్కారం తో సహా అనేక ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు .

టెలివిజన్ నిర్మాతల మండలి (టి వి పి సి ) వ్యవస్థాపకుల్లో ముఖ్యుడు. శ్రీధర్ కు భార్య , కుమారుడు, కుమార్తె ఉన్నారు. బన్సీలాల్ పేట స్మశాన వాటికలో అంత్యక్తియలు బుధవారం మధ్యాహ్నం జరుగుతాయని ఆయన తమ్ముడు భరత్ తెలిపారు.

శ్రీధర్ ధర్మాసనం మృతి పట్ల టెలివిజన్ నిర్మాతల మండలి తీవ్ర విషాదం వ్యక్తం చేసింది. ఓక ఆత్మీయుణ్ణి కోల్పోయామని
టివిపిసి అధ్యక్ష్యుడు షరీఫ్ పేర్కొన్నారు. శ్రీధర్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

టివిపిసి ముఖ్యులు ఎల్. త్రినాథ రావు, పి.వి. రామ మోహన్ నాయుడు, వల్లభనేని మహీధర్, సత్యం బాబు, నల్లూరి సుధీర్ కుమార్, గుణవర్ధన్ తదితరులు కూడా తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు..

ఇక శ్రీధర్ మృతి పట్ల తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.