https://oktelugu.com/

Zero Downpayment: ఒక్కరూపాయి డౌన్ పేమేంట్ లేకుండా ఇలా కారును కొనుగోలు చేయొచ్చు.. వీరికి మాత్రమే..

అయితే ఈ అవకాశం బ్యాంకు కొత్త కస్టమర్లకు కాకుండా ఇప్పటికే ఖాతా ఉన్నవారికి ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. వారు చేసే ట్రన్జాక్షన్, డిపాజిట్ల ఆధారంగా ఈ అవకాశం ఇస్తాయి. ఇందులో కస్టమర్లు ఎలాంటి డౌన్ పేమేంట్ లేకుండానే కారును ఇంటికి తీసుకురావొచ్చు.

Written By:
  • Srinivas
  • , Updated On : May 8, 2024 / 03:45 PM IST

    Zero down paymer Car loan

    Follow us on

    Zero Downpayment:కారు కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ సరైన బడ్జెట్ అందరికీ ఉండదు.ఈ క్రమంలో కొందరు అప్పు చేసీ మరీ కారు కొని తమ కోరిక నెరవేర్చుకుంటారు. మరికొందరు బ్యాంకు నుంచి రుణ సాయం ద్వారా సొంత కారును తెచ్చుకుంటారు. ఈ క్రమంలో బ్యాంకు నుంచి రుణం తీసుకున్నా.. డౌన్ పేమెంట్ గా ఎంతో కొంత చెల్లించాల్సి ఉంటుంది. కనీసంగా రూ.10వేల నుంచి లక్ష వరకు చెల్లించాలి. కానీ ఈ డౌన్ పేమేంట్ కూడా కట్టకుండా కారును కొనుగోలు చేయొచ్చు. ఈ అవకాశాన్ని కొందరు మాత్రమే పొందుతారు. వాళ్లెవరో ఒకసారి చూద్దాం..

    బ్యాంకు రుణం ద్వారా కారు కొనుగోలు చేయడానికి చాలా మంది ఉత్సాహం చూపుతారు. ఎందుకంటే ఒకేసారి లక్షలు చెల్లించకుండా నెలనెల తెలియకుండా డబ్బులు చిన్న మొత్తంలో డబ్బులు చెల్లించవచ్చు. ఇలా సంవత్సరాల పాటు తక్కువ మొత్తాన్నిచెల్లిస్తూ కారును వాడుకోవచ్చు. కానీ మొత్తంగా తీసుకున్న రుణంపై ఎంతో కొంత వడ్డీ మాత్రం చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా బ్యాంకు రుణం ద్వారా కారు కొనుగోలు చేస్తే.. 8.75 నుంచి 9 శాతం వరకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక్క రూపాయి కడా డౌన్ పేమేంట్ చెల్లించకుండా కారును కొనుగోలు చేయొచ్చు..

    అయితే ఈ అవకాశం బ్యాంకు కొత్త కస్టమర్లకు కాకుండా ఇప్పటికే ఖాతా ఉన్నవారికి ఆఫర్లు ఇస్తూ ఉంటాయి. వారు చేసే ట్రన్జాక్షన్, డిపాజిట్ల ఆధారంగా ఈ అవకాశం ఇస్తాయి. ఇందులో కస్టమర్లు ఎలాంటి డౌన్ పేమేంట్ లేకుండానే కారును ఇంటికి తీసుకురావొచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా డౌన్ పేమేంట్ లేకుండా కారును కొనుగోలు చేయడం వల్ల వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇలా కారును కొనుగోలు చేసేవారు 9 నుంచి 10 శాతం వడ్డీని చెల్ంచాల్సి ఉంటుంది.

    అయితే ఇలా కారు కొనుగోలు చేసేవారు వడ్డీ శాతం ఎక్కువగా చెల్లించాల్సి వచ్చినా రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులు కంపెనీనే భరిస్తుంది. ఇలా మరో రకంగా సదుపాయం కల్పిస్తారు. మొత్తంగా ఎలాంటి డౌన్ పేమేంట్ లేకుండా కారు కొనుగోలు చేయాలనుకునేవారు ఈ సౌకర్యాన్ని పొందవచ్చు.