ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎంతసేపూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలోనే ఉన్న పార్టీలు.. ఓటింగ్ పర్సంటేజీ పెంచడంపై దృష్టి సారించడం లేదు. దీంతో ఈ టెన్షన్ ఇప్పుడు ప్రతి పార్టీలోనూ కనిపిస్తోంది. గ్రేటర్ పోలింగ్ శాతం ఎప్పుడు చూసినా గందరగోళమే. కనీసం 50 శాతం కూడా దాటడం లేదంటే గ్రేటర్ ఓటర్ల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
Also Read: ఇటు కేసీఆర్.. అటు మోడీ.. ఏం జరుగనుంది?
గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం 45 మాత్రమే. అంటే ఓటు హక్కును వినియోగించుకున్న వారి కన్నా, ఓటు హక్కును వినియోగించుకోని ఓటర్ల సంఖ్యే ఎక్కువ. దేశంలో సార్వత్రిక ఎన్నికల సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో 75 నుంచి 80 శాతం వరకూ పోలింగ్ నమోదవుతూ ఉంటుంది. ఉత్తరాదిన 60 శాతమే నమోదవుతుంది. హైదరాబాద్‌లోనూ సార్వత్రిక ఎన్నికల్లో తక్కువగా ఓటింగ్ శాతం నమోదవుతుంది. అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయంలో స్థానికేతరులు ఓటింగ్ పట్ల పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
హైదరాబాద్‌లో సెటిలర్స్ సంఖ్య కూడా ఎక్కువే. వారి గుర్తింపు కోసం ఓటు హక్కు హైదరాబాద్‌లోనే తీసుకున్నా ఓటు వేయడానికి బారులు తీసే పరిస్థితి ఉండదు. దీంతోనే కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడ పోలింగ్ శాతం చాలా చాలా తక్కువగా నమోదవుతూ ఉంటుంది. ఈసారి కరోనా భయం ప్రజలను ఇంకా వీడలేదు. మామూలు పరిస్థితుల్లోనే 55 శాతం దాటని ఓటింగ్ శాతం.. ఇప్పుడు ఈ కరోనా భయం నేపథ్యంలో ప్రజలు క్యూలో నిల్చుండి ఓటింగ్‌కు ఆసక్తి చూపుతారా అనేది అనుమానంగా ఉంది.
Also Read: ప్రకాశ్ రాజ్ కు మొదలైన సెగ..పనికిమాలినవాడు.. నాగబాబు కౌంటర్..!
మరోవైపు.. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల్లో మత ప్రచారం రచ్చకెక్కింది. దీనిని చాలా మంది ప్రజలు కూడా ఓన్ చేసుకోవడం లేదు. పోలింగ్ శాతంపై ఈ అంశం కూడా ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనికితోడు పోలింగ్ రోజున సెలవు. ముందు ఆదివారం, సోమవారం సెలవులు కూడా ఉన్నాయి. దీంతో లాంగ్ వీకెండ్ వచ్చి పడింది. అందులోనూ లాక్‌డౌన్ వేళ సొంతూళ్లకు వెళ్లిన చాలా మంది ఇంకా సిటీకి చేరనేలేదు. ప్రత్యేకంగా ఓటేయడానికి వారు హైదరాబాద్ వెళ్లే అవకాశాలు ఏ మాత్రం లేవు. వీటన్నింటినీ చూస్తుంటే.. పోయిన ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతం కూడా ఈసారి నమోదవుతుందా అనేది ప్రశ్నలా మారింది.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్