Secret operation in Myanmar: అజిత్ ధోవల్.. ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. పాకిస్తాన్‌లో బిచ్చగాడిలా ఉండి.. అక్కడి సైనిక రహస్యాలు తెలుసుకుని.. భారత్ రక్షణ చర్యల్లో కీలకంగా మారారు. ఇప్పటికీ ఆయన సైనిక సలహాదారుగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తాజాగా అజిత్ ధోవల్ తరహాలో మయన్మార్‌లో రహస్య ఆపరేషన్‌తో మరో వీరుడు వెలుగులోకి వచ్చాడు. మయన్మార్ భూభాగంలో రహస్య ఆపరేషన్ నిర్వహించి ఉగ్రవాద క్యాంప్‌ను ధ్వంసం చేసింది. తాజా శౌర్య చక్ర పురస్కార ప్రకటనతో ఈ విషయం బయటపడింది. 21వ పారా స్పెషల్ ఫోర్స్‌కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ ఘటాగె ఆదిత్య శ్రీకుమార్‌కు ఈ గొప్ప గుర్తింపు లభించింది.
ఆపరేషన్ ఇలా..
2025 జూలై 11–13 మధ్య భారత–మయన్మార్ సరిహద్దులో ఈ చర్య జరిగింది. దేశ వ్యతిరేక మూకల శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని కచ్చితమైన దాడి చేశారు. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం (ఇండిపెండెంట్) 9 మంది నాయకులను ట్టు పెట్టింది. కేంద్రం వివరాలు వెల్లడించకపోయినా, ఈ పురస్కారం దానిని ధ్రువీకరించింది.
సరిహద్దు విభజన ఉద్యమం..
భారత్‌కు మయన్మార్‌తో 1,600 కి.మీ. సరిహద్దు ఉంది. అస్సాం ప్రాంట్‌లో ULFA(I) విడిపోయే డిమాండ్‌తో కార్యకలాపాలు చేస్తోంది. మయన్మార్‌లోని సగైంగ్ ప్రాంతం ఈ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారింది. డ్రోన్, క్షిపణి దాడులతో ఈ ఆపరేషన్ విజయవంతమైంది.
ఇలాంటి రహస్య చర్యలపై కేంద్రం ధ్రువీకరణ అరుదు, ఇది ఆపరేషన్ విజయాన్ని సూచిస్తుంది. సరిహద్దు భద్రత పెరిగి, ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గుతాయి. భవిష్యత్‌లో ఇలాంటి ఆపరేషన్లు పెరిగే అవకాశం ఉంది.