AP Singh statement: పాకిస్తాన్‌లోలాగా, బంగ్లాదేశ్‌లోలాగా మన ఆర్మీ చీఫ్ పెద్దగా పత్రికలకు ఎక్కరు. ప్రెస్‌మీట్ పెట్టరు. బయట కార్యక్రమాలకు రారు. ఇంటర్వ్యూలు ఇవ్వరు. బహిరంగంగా ప్రకటన చేస్తే మాత్రం అది చాలా ముఖ్యమైన అంశం అవుతుంది. మన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ ఏపీ.సింగ్ ఇటీవల ఏయిర్ మార్షనల్ సుభ్రతో ముఖర్జీ స్మృతి కార్యక్రమంలో మాట్లాడారు. ఒక దేశం ఆర్థికంగా బలంగా ఉన్నంత మాత్రాన సరిపోదని, అది సైనికపరంగా సెక్యూర్ అయి ఉండాలన్నారు. టెక్నాలజీ ఉండొచ్చు. ఆర్థికంగా ప్రగతి ఉండొచ్చు. కానీ ఇవి సరిపోవని తెలిపారు. దేశం శక్తిని మిలటరీ పవర్ మాత్రమే తెలియజేస్తుందని వెల్లడించారు. ఇటీవల అమెరికా సైన్యం వెనెజెవెలాలో చొరబడి నిమిషాల వ్యవధిలో అధ్యుడు నికోలస్ మదురో, ఆయన భార్యను తీసుకుని వెళ్లారు. వెనుజువెలా ఆర్థికంగా బలంగా ఉంది. టెక్నాలజీ ఉంది. అయినా అమెరికా సైన్యం వెనెజువెలాలో చొరబడిందని స్పష్టంగా చెప్పారు.
మోదీ ప్రభుత్వ వ్యూహం..
పటాన్‌కోట్, పుల్వామా, పహల్గామ్ దాడుల తర్వాత పాకిస్తాన్‌పై తిప్పికొట్టిన చర్యలు మోదీ ‘విల్ టు యూజ్’ని చూపాయని అన్నారు. ప్రభుత్వ సంకల్పం, ఆత్మవిశ్వాసం లేకుండా ఆయుధాలు సరిపోవని సూచించారు. ఏపీ సింగ్ హెచ్చరికలు కూడా ఇప్పుడు కీలకంగా మారాయి. మన ప్రభుత్వాలు కూడా సైనికులకు స్వేచ్ఛ ఇవ్వాలని అవసరమైతే దాడులు చేసే స్వేచ్ఛ ఇవ్వాలని పరోక్షంగా సూచించారు.
వాయుసేనా మరింత బలోపేతం కావాలి. పరిశోధన, అభివృద్ధి, ఆయుధాల అందుబాటును పెంచాలి. అవసర సమయంలో సైనిక శక్తిని ఉపయోగించే సంకల్పం కీలకమని నొక్కి చెప్పారు.