Secret Behind Rajya Sabha Ticket: బీసీ ఉద్యమనేత.. ఆర్.కృష్ణయ్య. రంగరారెడ్డి జిల్లాకు చెందిన ఆయనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి సడన్‌గా ప్రేమ పుట్టుకొచ్చింది. అది చిన్నపాటిదికాదు.. ఏకంగా రాజ్యసభకు పంపేంత ప్రేమ! జూన్‌లో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలకు ఎన్నిక సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థుల ఎంపికలో తెలంగాణ ముఖ్యమంత్రి కాస్త ఆలస్యం చేశారుగానీ, ఏపీ సీఎం జగన్ స్పీడ్‌గా అభ్యర్థులను కన్ఫర్మ్ చేశారు. అందులో ఒకరు తెలంగాణకు చెందిన బీసీ ఉద్యమ నాయకుడు ఆర్.కృష్ణయ్య. తెలంగాణకు చెందిన వ్యక్తిపై ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీఎం టికెట్ ఇవ్వడమే ఇప్పుడు చర్చనీయాంశం. తెలంగాణలో తనకు ఉన్న ఆస్తులను కాపాడుకోవడానికి, బీసీలకు అగ్రస్థానం వేస్తున్నామన్న క్రెడిట్ కొట్టేయడానికే జగన్ ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ టికెట్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఎవరికీ అంతుచిక్కని జగన్ ఆలోచన..
బీసీ కృష్ణయ్యను జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యసభకు ఎందుకు పంపిస్తున్నాడో అర్థం గాక, అంతుపట్టక చాలామంది జుత్తు పీక్కుంటున్నారు. కేవలం బీసీ ముద్ర కోసమే అయి ఉండొచ్చన్న అభిప్రాయానికి వచ్చేస్తున్నారు.
Also Read: The financial crisis: కేసీఆర్, జగనే కాదు.. మోడీ కూడా అంతే!
ఆస్తుల రక్షణ కోసమే..?
జగన్‌కు హైదరాబాద్‌లో లెక్కలేనన్ని బినామీ ఆస్తులు ఉన్నందున వాటి రక్షణ కోసం తెలంగాణ వారిని ఏపీ ప్రభుత్వ సలహాదారులుగా, రాజ్యసభ సభ్యులుగా నియమిస్తునానరని తన కథనంలో పేర్కొన్నారు. కానీ జగన్ బినామీ ఆస్తులకు రక్షణ కోసం కృష్ణయ్య ఎలా ఉపయోగపడగలడో అంతుచిక్కడి ప్రశ్న. నిజానికి ‘నీకు రాజ్యసభ ఎందుకు ఇస్తున్నాడు జగన్’ అని నేరుగా కృష్ణయ్యనే అడిగితే జవాబు రాకపోవచ్చు.. తనకైనా ఈ స్ట్రాటజీ ఏమిటో తెలుసా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. జగన్ నిర్ణయాల్లోని కొన్ని మిస్టరీలలో కృష్ణయ్యదీ ఒకటి.
అప్పుల ఊబిలో రెండు తెలుగు రాష్ట్రాలు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. అంధ్రప్రదేశ్ మొదటి నుంచి అప్పుల్లోనే ఉంది. మిగులు బడ్జెట్‌తో ఆవిర్భవించిన తెలంగాణ కూడా పాలకుల తీరుతో అప్పుల్లో కూరుకుపోతోంది. ఆర్థిక పరిస్థితులు దిగజారుతుండడంతో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్పుల కోసం అధికారులు ఢిల్లీలో తిష్టవేశారు. మింగ మెతుకు లేదు గానీ మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు తెలంగాణ ముఖ్యమంత్రి నార్త్ రైతుల కుటుంబాలకు పరిహారాలు, గల్వాన్ జవాన్ల కుటుంబాలకు పరిహారాల పంపిణీ చేశారు. ఇక ఏపీ సీఎం ఆ రాష్ట్రంలో బీసీలు ఎవరూ లేరు అన్నట్లు తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యను పిలిచి రాజ్యసభ టికెట్ ఇచ్చారు. అటు జగన్, ఇటు కేసీఆర్ తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఎవరికీ అంతుపట్టరు. తామెవరికీ జవాబులు చెప్పే పనిలేదు అన్నట్టుగానే వ్యవహరిస్తారు. కొన్నిసార్లు జనం ఏమనుకుంటేనేం అన్నట్టుగా కూడా ఉంటారు. ఎవరికితోచిన విధంగా వారు అర్థం చేసుకోవాల్సిందే!!
Recommended Videos:
https://www.youtube.com/watch?v=iUtvpRtc5hE&t=11s
[…] […]
[…] […]
[…] […]