Screen Tourism: ఏదైనా లొకేషన్‌ను ఫోన్‌లో, రీల్స్‌లో, సినిమాలో చూసినప్పుడు అందంగా ఉందనిపిస్తుంది. వీలైతే ఒకసారి వెళ్లాలి అనిపిస్తుంది. కొన్ని లోకేషన్లను అయితే ఒక్కసారి అయినా చూడాలి అని గట్టిగా అనిపిస్తుంది. కానీ చాలా మంది చూడడం కుదరక ఆగిపోతారు. కానీ ఈ కాలం యువతలో మార్పు వచ్చింది. ఎక్కడికి వెళ్లాలనుకుంటారో అక్కడికి వెళ్లిపోతున్నారు. రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. ఇటీవల రణ్వీర్ సింగ్, అక్షయ్ ఖన్నా హీరోలుగా వచ్చిన ’ధురంధర్’ చిత్రం బలోచిస్తాన్ ఎడారి, కొండల సౌందర్యాన్ని ప్రదర్శించడంతో పాకిస్తాన్ యువత అక్కడికి పర్యాటక యాత్రలకు మళ్లారు. డ్రోన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ప్రాంతం కొత్త టూరిస్ట్ హాట్‌స్పాట్‌గా మారింది.
బాలీవుడ్ స్పెయిన్..
జోయా అక్తర్ ’జిందగీ నా మిలేగీ దోబారా’లో స్పెయిన్ ఉత్సవాలు, కోస్టా బ్రావా దృశ్యాలు చూపించడంతో భారతీయ పర్యాటకులు ఆ దేశానికి భీకరంగా పెరిగారు. ఆమిర్ ఖాన్ ’3 ఇడియట్స్’లో లద్దాఖ్ సౌందర్యం ప్రదర్శించడంతో ఆ ప్రాంత టూరిజం గణనీయంగా పెరిగింది.
తెలుగు సినిమాల్లోనూ..
‘ఈ నగరానికి ఏమైంది’, రొమాంటిక్’, ’టెంపర్’ చిత్రాలు గోవాను తెలుగు యువతకు ప్రత్యేక గంట్‌గా మార్చాయి. నాగచైతన్య ’ఏ మాయ చేసావే’తో కేరళ ఆకర్షణ పెరిగింది. కమల్ హాసన్ ’గుణ’ సినిమా కొడైకనాల్ డెవిల్స్ కిచెన్‌ను ’గుణ కేవ్స్’గా మార్చి టూరిస్ట్ స్పాట్‌గా మార్చింది.
వెబ్ సిరీస్‌లతో ఈశాన్య రాష్ట్రాలు..
’ది ఫ్యామిలీ మ్యాన్’, ’పాతాళ లోక్’ వంటి వెబ్ సిరీస్‌లు ఈశాన్య రాష్ట్రాల సౌందర్యాన్ని ప్రదర్శించడంతో పర్యాటకులు పెరిగారు. చాగంటి కోటేశ్వరరావు వైరల్ వీడియో అరుణాచలాన్ని తెలుగు ప్రజలకు పరిచయం చేసి, తెలంగాణ ప్రభుత్వం బస్సు సేవలు ప్రారంభించేలా చేసింది.
ప్రభుత్వ ప్రోత్సాహం..
సర్వేల ప్రకారం 44% పర్యాటకులు సినిమాలు చూసి ప్రదేశాలు ఎంపిక చేస్తున్నారు. కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని దేశ పర్యాటక ప్రాంతాలను చిత్రాలు, సిరీస్‌ల ద్వారా ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ట్రావెల్ వ్లాగర్లు స్థానిక కథలు, షూటింగ్ ట్రివియా షేర్ చేస్తున్నారు.
స్క్రీన్ టూరిజం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మార్గం సుగమం చేస్తోంది. సోషల్ మీడియా వల్ల యువత అనుభూతులు పంచుకుంటూ ప్రయాణాలు పెరుగుతున్నాయి. ఈ ట్రెండ్ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.