Actress Bindu Madhavi: ప్రముఖ నటుడు శివాజీ(Actor Sivaji) రీసెంట్ గా జరిగిన ‘దండోరా'(Dandora Movie) ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరోయిన్స్ వేసుకునే బట్టల మీద చేసిన కామెంట్స్ ఎలాంటి వివాదాలకు దారి తీసిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఒకరు పోతే ఒకరు, మీడియా ముందుకొచ్చి శివాజీ ని విమర్శిస్తూనే ఉన్నారు. చూస్తుంటే ఇప్పట్లో ఈ వ్యవహారం ఆగేలా అనిపించడం లేదు. మరోపక్క సినీ సెలబ్రిటీలు మొత్తం శివాజీ ని టార్గెట్ చేస్తుండడం చూసి , సోషల్ మీడియా లో నెటిజెన్స్ శివాజీ కి సపోర్ట్ చేస్తున్నారు. మంచి మాటలు చెప్పాడు, అది ఆయన అభిప్రాయం ,మధ్యలో రెండు తప్పుడు మాటలు మాట్లాడాడు, అందుకు క్షమాపణలు కూడా చెప్పాడు, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయకుండా, ఎక్కడికో తీసుకెళ్తున్నారు ఏంటి?, శివాజీ మీద ఇండస్ట్రీ లో ఇంత పగ ఉందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే ఆయన ముఖ్య పాత్ర పోషించిన ‘దండోరా’ మూవీ టీం నుండి కూడా శివాజీ కి పూర్తి స్థాయి సపోర్టు లేదు. ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించిన బిందు మాధవి రీసెంట్ గా మీడియా మాట్లాడుతూ ‘ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది, ఎవరిష్టం వాళ్ళది అండీ, ఇక్కడ ఎవరికీ చెప్పాలి?, ఒక అమ్మాయి బయటకు వచ్చినప్పుడు ఎవరైనా చెయ్యి వేస్తున్నారంటే అది అమ్మాయి తప్పా?, లేదా అబ్బాయి తప్పా?, అంటే ఎవరికీ చెప్పాలి మనం?, అమ్మాయికి చెప్పాలా?, అబ్బాయికి చెప్పాలా?, ఇలాంటివి చాలా వస్తాయి అండీ. కేవలం డ్రెస్ విషయం లో ఒక్కటే కాదు, అనేక విషయాల్లో ఇలాంటి కోణాలు ఉంటాయి. ఇక్కడ జెండర్ గురించి ప్రస్తావించడం కంటే, ఎడ్యుకేట్ చేయడం ముఖ్యం. తప్పు జరుగుతుంటే, మీరు చేస్తున్నారు, మీరు మారాలి, అంతే కానీ అమ్మాయిలు వేసుకునే డ్రెస్సింగ్ వల్ల ఇలా జరుగుతుంది కాబట్టి, అమ్మాయిలు శరీరం మొత్తం కప్పేసుకొని ఇంట్లోనే కూర్చోమంటే ఎలా?’ అని అంటుంది.
కొనసాగింపుగా యాంకర్ మరో ప్రశ్న అడుగుతూ ‘శివాజీ గారు చేసిన కామెంట్స్ ని జనాలు రెండు వేస్ లో చూస్తున్నారు. ఆయన వాడిన పదాలు తప్పుగా అడ్రస్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, అసలు ఇదంతా చెప్పడానికి ఈయనెవరు? అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరు ఎటు వైపు ఉంటున్నారు?’ అని బిందుమాధవి ని అడగ్గా, దానికి ఆమె సమాధానం ఇస్తూ ‘ప్రతీ ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటుంది. దానిని ప్రకటించడం లో స్వేచ్ఛ ఉంటుంది, అందులో ఎలాంటి తప్పు లేదు, కానీ మనకి ఉండాల్సిన అభిప్రాయం మనకి ఒకటి ఉండాలి కదా, ఆయన అభిప్రాయం కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్న ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.
ఎవరి ఇష్టం వాళ్లది..
ఏ డ్రెస్ వేసుకోవాలనేది ఆడవాళ్ల ఇష్టం.
తెలుగు360తో శివాజి డ్రెస్సింగ్ కాంట్రవర్సీ పై నటి బిందు మాధవి కామెంట్స్#BinduMadhavi pic.twitter.com/H24ReYkeOS
— Telugu360 (@Telugu360) December 26, 2025