Mana Shankara Varaprasad Garu Songs: ఒక సినిమాని మార్కెటింగ్ ఎలా చెయ్యాలి అనే విషయం లో మన టాలీవుడ్ లో రాజమౌళి(SS Rajamouli) కి తెలిసినంతగా ఏ డైరెక్టర్ కి తెలియదు. ఆయన తర్వాత మార్కెటింగ్ విషయం లో అనిల్ రావిపూడి(Anil Ravipudi) ఒక సెన్సేషన్ క్రియేట్ చేసాడు అనే చెప్పొచ్చు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. 300 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి, స్టార్ హీరోలకు కూడా సాధ్యం అవ్వని అరుదైన ఫీట్ ని అందుకుంది. ఈ సినిమా ఆడియన్స్ కి ఆ రేంజ్ లో రీచ్ అవ్వడానికి ప్రధాన కారణం ప్రొమోషన్స్. సినిమా విడుదలకు నెల రోజుల ముందు నుండే అనిల్ రావిపూడి ప్రొమోషన్స్ విషయం లో ఒక సరికొత్త ఒరవడి ని సృష్టించాడు. ప్రొమోషన్స్ లో ఆయన క్రియేట్ చేసిన ట్రెండ్ ని నేడు అందరూ అనుసరిస్తున్నారు. కానీ అనిల్ రావిపూడి కి వర్కౌట్ అయినట్టు నేచురల్ గా ఎవరికీ వర్కౌట్ అవ్వడం లేదు.
వేరే వాళ్లకు వర్కౌట్ అవ్వడం విషయాన్ని పక్కన పెడితే, అనిల్ రావిపూడి కి కూడా ఈసారి వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తో ఆయన తెరకెక్కించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా విడుదలకు పట్టుమని 16 రోజులు కూడా లేవు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రొమోషన్స్ మొదలు అవ్వలేదు. ప్రొమోషన్స్ సంగతి పక్కన పెడితే టీజర్, ట్రైలర్ ఎప్పుడొస్తుందో కూడా ఆడియన్స్ కి తెలియదు. మొత్తం నాలుగు పాటలు ఉంటే, ఇప్పటి వరకు కేవలం రెండు మాత్రమే విడుదల చేశారు. ఆ రెండిట్లో ఒకటి హిట్, ఇంకోటి ఫట్టు. చిరంజీవి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన పాటకు సంబంధించిన ప్రోమో ని డిసెంబర్ 30 న విడుదల చేస్తారట.
ఇక పూర్తి పాటని ఎప్పుడు విడుదల చేస్తారో మరి. అది కాకుండా ఇంకో పాట విడుదల అవ్వాలి , మళ్లీ థియేట్రికల్ ట్రైలర్ కూడా రావాలి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే , ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారట. అంతే కాకుండా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కాకపోవడం తో అనిల్ రావిపూడి ఆ టెన్షన్ లో ఉండడం వల్ల, ఒక పక్క ప్రొమోషన్స్ చేయలేకపోతున్నాడు, మరో పక్క ప్రమోషనల్ కంటెంట్ ని కూడా విడుదల చేయలేకపోతున్నాడు. ఫలితంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఏర్పడిన ఆర్గానిక్ హైప్ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి ఏర్పడలేదు. ఇలాగే కొనసాగితే మాత్రం ఓపెనింగ్స్ పై చాలా బలమై ప్రభావం పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.